హైదరాబాద్: తెలంగాణ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ వద్ద పనిచేస్తున్న డ్రైవర్‌ అరెస్టయ్యాడు. తెల్లాపూర్‌లోని సుమంత్ నివాసం వద్ద పోలీసులు డ్రైవర్‌ను ఆదివారం అరెస్ట్ చేశారు. ఒక వ్యాపారిని రూ.10 కోట్లు ఇవ్వాలని తీవ్రంగా బెదిరించడమే కాకుండా, ఆయనపై ఇనుప రాడ్లతో దారుణంగా దాడి చేసిన ఘటనపై ఇదివరకే ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ దాడి కేసులో ప్రమేయం ఉన్నందున సుమంత్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

ఈ దారుణానికి ప్రధాన కారకుడిగా భావిస్తున్న మాజీ ఓఎస్డీ సుమంత్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. వ్యాపారిపై జరిగిన దాడి, దౌర్జన్యం వెనుక ఉన్న పూర్తి వివరాలను రాబట్టేందుకు.. విచారణ వేగవంతం చేసేందుకు గానూ పరారీలో ఉన్న సుమంత్ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. బాధితుల నుంచి ఫిర్యాదు రావడంతో మొదట మేడిపల్లి పోలీసులు జీరో FIR నమోదు చేసి అనంతరం కేసును జూబ్లీహిల్స్‌ పీఎస్‌కు బదిలీ చేశారు.

కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్ అరెస్ట్

తెల్లాపూర్‌లోని సుమంత్ ఇంటి ముందు అరెస్ట్ చేసిన పోలీసులు

ఓ వ్యాపారిని రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసి, ఇనుప రాడ్లతో దారుణంగా దాడి చేశాడని సుమంత్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు

ఈ కేసులో సుమంత్ డ్రైవర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు https://t.co/UIuTI4eaeq pic.twitter.com/zQxndu59pD

— Telugu Scribe (@TeluguScribe) August 23, 2026