ARTICLE AD
నందమూరి నటసింహ బాలకృష్ణ కొన్నేళ్లుగా వరసగా సక్సెస్ ఫుల్ చిత్రాలు అందిస్తూ సీనియర్ హీరోస్ లోనే క్రేజీగా మారిపోయారు. బాలయ్య తో సినిమా అంటే కాసుల వర్షమే అని నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. అందుకే ఆయనతో సినిమాలు చేసేందుకు ఉత్సాహపడిపోతున్నారు. డాకు మహారాజ్ తర్వాత బోయపాటి కాంబోలో బాలయ్య అఖండ 2 తాండవం చేసారు. అఖండ తో బాక్సాఫీసుని బద్దలు కొట్టిన ద్వయం తో సినిమా అంటే నిర్మాతలు ఏ రేంజ్ లో ఖర్చు పెట్టాలి.
14 రీల్స్ అధినేతలు అఖండ 2 మూవీని ఎక్కడా తగ్గకుండా భారీగానే ఖర్చు పెట్టి దసరా కు సినిమాను విడుదల చేద్దామనుకుని.. సీజీ వర్క్ కంప్లీట్ అవ్వక సినిమాని డిసెంబర్ 5 కి అది కూడా పాన్ ఇండియా మర్కెట్ లో దించుతున్నట్టుగా అనౌన్స్ చేసారు. అందుకు అనుగుణంగానే బాలయ్య-బోయపాటి ముంబై, చెన్నై, బెంగుళూరు అంటూ సినిమాని బాగా ప్రమోట్ చేసి అంచనాలు పెంచేశారు.
ఈరోజు విడుదలకు ఒక రోజు ముందే ప్రీమియర్స్ తో హడావిడి, టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి, ఎక్కడ చూసినా అఖండ 2 జాతర కనిపించింది. కానీ చివరి నిమిషంలో అఖండ 2 పోస్ట్ పోన్ అయ్యింది. దానితో అభిమానులు డిజప్పాయింట్ అవడమే కాదు ఆడియన్స్ కూడా బాలయ్య సినిమాకి ఇలాంటి గతా అంటూ కామెంట్లు పెట్టడం అభిమానులకు చిరాకు తెప్పించింది.
సక్సెస్ ఫుల్ హీరో సినిమాని ఇలా విడుదలకు ఫైనాన్సియల్ ప్రోబ్లం తో విడుదల ఆపడం ఏంటి అంటూ నిర్మాణ సంస్థపై అభిమానులు ఫైర్ అవుతున్నారు.

18 hours ago
1