బాలయ్య ఫేవరెట్ హీరోయిన్

10 months ago 8
ARTICLE AD

అన్ స్టాపబుల్ గా సక్సెస్ లు అందుకోవడమే కాదు నిజంగా బాలయ్య కెరీర్ అన్ స్టాపబుల్ గా దూసుకుపోతున్న క్రమంలో ఆయనకు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ట్మాకమైన పద్మభూషణ్ అవార్డు ప్రకటించడంతో సినిమా ఇండస్ట్రీ నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అంతేకాదు బాలయ్య చెల్లెలు నారా భువనేశ్వరి అన్న బాలయ్యకు ఆయనతో పని చేసిన దర్శకనిర్మాతలకు బిగ్ పార్టీ కూడా ఇచ్చారు. 

శనివారం నైట్ జరిగిన పార్టీలో బాలయ్యను ఆయన చెల్లెళ్ళు నారా భువనేశ్వరి, పురంధరేశ్వరి, లోకేశ్వరి లు ఆటపట్టించిన వీడియో వైరల్ అయ్యింది. స్టేజ్ మీద బాలయ్యను కూర్చోబెట్టి భువనేశ్వరి మీతో వర్క్ చేసిన హీరోయిన్స్ లో మీకు ఎవరు అంటే ఇష్టం అని అడగగా.. దానికి బాలయ్య ఏ హీరోయిన్ పేరు చెబితే ఏమవుతుందో అని నా హీరోయిన్ వసు నే అన్నారు. 

భార్య అనే వాళ్ళు యాక్ట్ చెయ్యరు, మీరు చెప్పండి ఏ హీరోయిన్ అంటే ఇష్టం అని అడగగా.. దానికి బాలయ్య విజయశాంతి అన్నారు.  ఆ తర్వాత రెండు, మూడు అనగానే బాలయ్య తడుముకోకుండా రమ్యకృష్ణ, సిమ్రాన్ పేర్లు చెప్పారు. విజయశాంతి-బాలకృష్ణ, రమ్యకృష్ణ-బాలకృష్ణ, సిమ్రాన్-బాలకృష్ణ కాంబోలో ఎన్నో మంచి హిట్స్ వచ్చిన విషయం తెలిసిందే. 

Read Entire Article