బ‌న్నీ బ్యాక్ టూ సెట్స్ ఎప్పుడు

3 weeks ago 4
ARTICLE AD

ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  తన తదుపరి భారీ ప్రాజెక్ట్ అట్లీ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న‌ సినిమా షూటింగ్ నుండి చిన్నపాటి విరామం తీసుకున్నారు. గత కొద్దిరోజులుగా ఆయన తన వ్యక్తిగత పనులతో పాటు కుటుంబ వేడుకల్లో బిజీగా గడుపుతున్నారు. ముఖ్యంగా తమ్ముడు అల్లు శిరీష్ వివాహం కావ‌డంతో మొన్న‌టి వ‌ర‌కూ ఆ ప‌న‌రుల్లో బిజీ అయ్యాడు.

వివాహం అనంత‌రం త‌న వ్య‌క్తిగ‌త ప‌నుల్లోనూ నిమ‌గ్న‌మ‌య్యాడు. ఇదే స‌మ‌యంలో కుటుంబంతోనూ బాగా చిలౌట్ అవుతున్నాడు. అలాగని ఇంటికే పరిమితం కాకుండా అప్పుడప్పుడు సిటీలో కూడా కనిపిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. తన వ్యక్తిగత కార్యాలయానికి వెళ్లడం, ఇతర ఏర్పాట్లలో చురుగ్గా పాల్గొనడం వంటివి చేస్తూ హైదరాబాద్ వీధుల్లో సందడి చేస్తున్నాడు.

`పుష్ప 2` వంటి భారీ విజయం తర్వాత దక్కిన ఈ విరామాన్ని ఆయన తన ఆత్మీయులతో కలిసి ఆస్వాదిస్తున్నారు.  మ‌రి బ‌న్నీ తిరిగి షూటింగ్‌లో జాయిన్ అయ్యేది ఎప్పుడు? అంటే  నాలుగైదు రోజుల్లోనే షూట్ మొద‌ల‌వుతుంద‌ని తెలిసింది. అయితే ఈసారి షెడ్యూల్ యాధావిధిగా ముంబైలో మొద‌ల‌వుతుందా?  హైద‌రాబాద్ లో నిర్వ‌హిస్తారా? అన్న‌ది క్లారిటీ లేదు.

ఇంత వ‌ర‌కూ ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి ఒక్క సీన్ కూడా హైద‌రాబాద్ లో చేయలేదు. దీంతో అభిమానులంతా హైద‌రాబాద్ షెడ్యూల్ ఎప్పుడు  ఉంటుందా? అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. మ‌రి దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్య‌త మాత్రం బ‌న్నీపైనే ఉంది.

Read Entire Article