ఫిబ్రవరి డోస్ సరిపోలా

3 months ago 12
ARTICLE AD

అవును ఫిబ్రవరి బాక్సాఫీసు లో జోష్ ఉంటుంది అని ఆశపడిన ఆడియన్స్ కి ఫిబ్రవరి బాక్సాఫీసు ఉసూరుమనిపించింది. ఏ మాత్రం ఆసక్తిలేని సినిమాలు ఆడియన్స్ ని నిరాశపరిచారు. పర్లేదు అన్న సినిమాలకు కూడా థియేటర్స్ లో ప్రేక్షకులు ఆకరువయ్యారు. వాటిని ఓటీటీ లో చూడొచ్చని ఫిక్స్ అయ్యారు.

ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ ఫీవర్ ఉన్నా సంక్రాంతి కి రావాలనుకుని వాయిదా వేసుకున్న సినిమాలు ఫిబ్రవరి నే చూజ్ చేసుకుంటాయి. కానీ ఈ ఫిబ్రవరిలో విశ్వక్ సేన్ ఫంకీ, శ్రీ విష్ణు విష్ణు విన్యాసం లాంటి సినిమాలు వచ్చినా.. అవి అంచనాలను రీచ్ అవ్వలేదు. మీడియం రేంజ్ సినిమాలు అన్ని షెడ్డుకెళ్ళిపోయాయి.

సంక్రాంతి సినిమాల జోరు తర్వాత ఇప్పటివరకు అయ్యామన్న సినిమా ఏది రాలేదు. ఫ్రైడే డ్రై డే కాదు, ఫిబ్రవరి డ్రై మొంత్ అంటూ ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. థియేటర్స్ లోనే సినిమాలు లేవు అంటే ఇక ఓటీటీలో ఏముంటాయి. ఓటీటీలో చూసేందుకు సినిమాలు లేవు, ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లు లేవు అంటూ మూవీ లవర్స్ డిజప్పాయింట్ అవుతున్నారు. 

Read Entire Article