Indias First E100 Ethanol Car | భారత్‌లో గత కొన్నేళ్లుగా గ్రీన్ ఎనర్జీపై ఫోకస్ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ బదులుగా ప్రత్యామ్నాయ ఇంధనాన్ని ప్రోత్సహించే దిశగా మరో కీలక అడుగు పడనుంది. మారుతి సుజుకి జూన్ 4న తన మొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ (Flex Fuel) కారును లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, హర్దీప్ సింగ్ పురి కూడా ఈ లాంచింగ్ ఈవెంట్లో పాల్గొననున్నారు. వివిధ ఆటో షోలలో ఇప్పటికే ప్రదర్శించిన ఫ్రాంక్స్ (Maruti Fronx) ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్‌ను కంపెనీ ఆవిష్కరించే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు.

ఈ కారు సాధారణ పెట్రోల్‌కు బదులుగా E100 ఇథనాల్ (Ethanol) ఇంధనంతో నడిచేలా రూపొందించారు. భారత్ విదేశాల నుంచి ఇంధన దిగుమతులను తగ్గించి, స్వచ్ఛమైన ఇంధనాన్ని ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తున్న సమయంలో, ఈ సాంకేతికత భారత ఆటో మార్కెట్లో కీలక ఘట్టంగా భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు మారుతి జూన్ 3న చేయబోయే ఈ పెద్ద ప్రకటనపైనే ఆటో రంగం దృష్టి నెలకొంది.

ఫ్లెక్స్ ఫ్యూయల్ సాంకేతికత అంటే ఏమిటి
ఫ్లెక్స్ ఫ్యూయల్ సాంకేతికత కలిగిన కార్లు సాధారణ పెట్రోల్ కార్ల కంటే కొంచెం భిన్నంగా ఉంటాయి. వీటిలో E100 అంటే 100 శాతం ఇథనాల్ ఇంధనంతో కూడా పనిచేయగల ఒక ప్రత్యేకమైన ఫ్యూయల్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తారు. సాధారణ పెట్రోల్ కార్లు ఇలాంటి ఇంధనంతో నడవలేవు. ఎందుకంటే వాటి ఇంజన్, ఫ్యూయల్ సిస్టమ్‌లు దీనికి అనుగుణంగా డిజైన్ చేయలేదు. ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల్లో ఇంజన్ వివిధ రకాల ఇథనాల్ మిశ్రమాలను సులభంగా తట్టుకునేలా పలు సాంకేతిక మార్పులు చేస్తారు.

Also Read: Car Mileage Guide: కారు మైలేజ్ ఎందుకు తగ్గుతుంది? ఇవి పాటిస్తే మీ ఖర్చులు తగ్గుతాయి

ఈ కారణంగానే ఇటువంటి కార్ల ధర సాధారణ మోడళ్లతో పోలిస్తే ఫ్లెక్స్ ఫ్యుయల్ కారు కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. అయితే, పర్యావరణానికి జరిగే నష్టం తగ్గుతుంది. పెట్రోల్, డీజిల్ కార్ల కంటే చాలా తక్కువ కాలుష్యం విడుదల అవుతుంది. మరోవైపు పెట్రోల్‌పై ఆధారపడటం కూడా తగ్గుతుంది. కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా ఇథనాల్ ఆధారిత ఇంధనాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ ఫ్రాంక్స్ కారు కూడా ఆ ప్రణాళికలో భాగమేనని భావిస్తున్నారు.

గేమ్ ఛేంజర్ కానున్న ఫ్రాంక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్
మారుతి సుజుకి గతంలోనూ ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీపై పనిచేసింది. కంపెనీ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024 లో ఫ్లెక్స్ ఫ్యూయల్ వ్యాగన్ ఆర్ (Wagon R) ప్రోటోటైప్‌ను సైతం ప్రదర్శించింది. అలాగే జపాన్‌లో E85 సామర్థ్యం కలిగిన ఫ్రాంక్స్‌ను ప్రదర్శనకు ఉంచింది. ఇప్పుడు భారత్‌లో లాంచ్ కానున్న ఫ్రాంక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ దేశంలోనే మొట్టమొదటి E100 కారుగా మారవచ్చని భావిస్తున్నారు. దీని ధర, లాంచ్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.

Also Read: Electric Scooter కొనేముందు ఇది తెలుసుకోండి.. Hero, TVS లేదా OLA లలో బెస్ట్ ఏది

రాబోయే రోజుల్లో ఇతర వాహన తయారీదారులు కూడా ఈ ఫ్లెక్స్ ఫ్యుయల్ ఆధారిత కార్ల మోడళ్లను తీసుకురావచ్చు. దేశవ్యాప్తంగా E100 ఇంధన లభ్యత పెరిగితే, ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ల మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతుంది. అలాంటి పరిస్థితిలో మారుతి ఫ్రాంక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ అనేది కేవలం ఒక కొత్త కారు మాత్రమే కాకుండా, భారత ఆటో పరిశ్రమకు ఒక కొత్త దిశను చూపగలదు.