పవన్ దిగి రావాల్సిందే

3 months ago 12
ARTICLE AD

ఇలా వచ్చి అలా ప్రమోషన్స్ చేసి వెళ్లిపోకుండా కాస్త ఉస్తాద్ భగత్ సింగ్ కోసం పవన్ కళ్యాణ్ దిగి వచ్చి టైమ్ కేటాయిస్తే మేకర్స్ ఒడ్డున పడిపోతారు. ఎప్పుడో మూడేళ్ళ క్రితం మొదలైన హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ ల ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఫైనల్లీ ఈ మార్చ్ 26 న విడుదలకు సిద్దమైంది. ఓవర్సీస్ డీల్ క్లోజ్ అయ్యింది.

కానీ సినిమాపై బజ్ కనిపించడం లేదు. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్స్ స్టార్ట్ చెయ్యాలి, ట్రైలర్ వదలాలి. అప్పుడు ఏమైనా ఊపు కనిపిస్తుందేమో చూడాలి. ఇక పవన్ కళ్యాణ్ గతంలోలా అలా వచ్చి ఇలా వెళ్లకుండా ఉస్తాద్ భగత్ సింగ్ ని గట్టిగా ప్రమోట్ చెయ్యాలి, ఎంతగా డిప్యూటీ సీఎం కి పనులున్నా సినిమాని కూడా ఒడ్డునెయ్యాలి కదా.. అని సినీప్రియులు మాట్లాడుతున్నారు. 

ఎన్ని పనులున్నా పవన్ ఉస్తాద్ కోసం దిగి వస్తేనే నిర్మాతలకు హెల్ప్ అవుతుంది. వాళ్ళు సేవ్ అవుతారు. ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ వింటేజ్ పోస్టర్స్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చినా.. మిగతా మూవీ లవర్స్ లో హైప్ పెరిగేలా క్రేజీ కంటెంట్ వదలాలి. అప్పుడే సినిమాపై భీభత్సమైన క్రేజ్ వస్తుంది. ఈ విషయం హరిష్ శంకర్ కూడా ఆలోచించాలి. 

Read Entire Article