నిజం చెబితే ఉడుక్కోవడం ఎందుకు

10 months ago 8
ARTICLE AD

గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ ఎక్కువగా ప్రజల్లో కనిపించే కేతిరెడ్డి 2024 ఎన్నికల్లో కూటమి సునామిలో కొట్టుకుపోయాడు. కేతిరెడ్డి ఓటమిపై కేటీఆర్ లాంటి వాళ్ళే ఆశ్చర్యపోయారు. ఇక 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత కేతిరెడ్డి పదే పదే జగన్ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నారు. 

ఈమధ్యన కూటమి అనుకూల ఛానల్స్ కి ఇంటర్వూస్ ఇస్తూ జగన్ ఇప్పటికి ఓటమి నుంచి పాఠం నేర్చుకోవడం లేదు, పవన్ కళ్యాణ్ మంచోడు, ఆయన్ని కెలికినందుకే వైసీపీ ఓడిపోయింది. నోరు అదుపు లేని వాళ్లను ఇప్పటికైనా జగన్ పక్కనపెట్టాలి. ఓటమి నుంచి పాఠం నేర్వని జగన్ అంటూ మాట్లాడడం బ్లూ మీడియాకి సుతరామూ నచ్చలేదు. 

అందుకే జనసేనలో చేరేందుకు కేతిరెడ్డి రూట్ లైన్ క్లియర్ చేసుకోవడానికి జగన్ పై నెగెటివ్ గా మాట్లాడడం ఎందుకు, కూటమి ప్రభత్వం వచ్ఛాక ఈ  ఆరు నెలల్లో చాలా అరాచకాలు చేస్తుంది. వాటిపై మాట్లాడొచ్చు, ఇంకా పెదనాన్న పెద్దిరెడ్డిని సొంత నియోజక వర్గానికి రానివ్వకుండా కూటమి ప్రభుత్వం కట్టడి చేస్తుంది, ఇలాంటి వాటిపై మాట్లాడొచ్చు. కాని కేతిరెడ్డి పవన్ మంచోడు, జగన్ చెడ్డోడు అంటూ మాట్లాడడం ఎందుకు అంటూ బ్లూ మీడియా కేతి రెడ్డిపై ఫైర్ అవుతుంది. 

Read Entire Article