ARTICLE AD
ధురంధర్ పార్ట్ 1 డిసెంబర్ లో థియేటర్స్ లో విడుదలై సెన్సేషనల్ హిట్ గా నిలవడంతో.. దాని ఓటీటీ పార్ట్నర్ నెట్ ఫ్లిక్స్ ధురంధర్ 1 ని రెండు నెలల తర్వాతే స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ధురంధర్ ది రివెంజ్ కూడా అలానే అవ్వబోతుంది. మార్చ్ 19 న థియేటర్స్ లోకొచ్చిన ధురంధర్ బాక్సాఫీసు దగ్గర దుమ్ములేపుతోంది.
రూ.1700 కోట్లు కొల్లగొట్టి రికార్డ్ లు క్రియేట్ చేసిన ధురంధర్ 2 చిత్రాన్ని ఇప్పుడప్పుడే ఓటీటీ లో ఆశించడం కూడా కరెక్ట్ కాదు అనుకునేలా ఓ రెండు నెలల పైనే ధురంధర్ 2 ని ఓటీటీ వీక్షించేందుకు వీలులేదు అని తెలుస్తుంది. ఇప్పటికే సినిమా విడుదలై 40 రోజులు దాటిపోయింది.
ధురంధర్ 2 ని భారీ డీల్ తో ఓటీటీ హక్కులను దక్కించుకున్న జియో ప్లస్ హాట్ స్టార్ ధురంధర్ 2 ని మే 27 లేదా జూన్ 4 న స్ట్రీమింగ్ లోకి తేనున్నట్లుగా తెలుస్తుంది. అంటే ధురంధర్ 2 థియేటర్స్ లో విడుదలైన 70 రోజుల తర్వాతే స్ట్రీమింగ్ అనున్నట్లుగా టాక్. సో ధురంధర్ 2 కోసం వెయిట్ చెయ్యక తప్పదు.

1 hour ago
1