దీపిక ప‌దుకొనే సోద‌రి పెళ్లాడేది ఇత‌డినే

5 days ago 2
ARTICLE AD

సందీప్ వంగా - స్పిరిట్, క‌ల్కి 2898 ఏడి సీక్వెల్ నుంచి దీపిక ప‌దుకొనేను తొల‌గించిన త‌ర్వాత ఇది ఆన్ లైన్ లో బిగ్ డిబేట్ గా మారిన సంగ‌తి తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా ఆఫ‌ర్ల‌ను దీపిక కాల‌ద‌న్నుకుంది అంటూ ప్ర‌చారం సాగింది. ఎనిమిది గంట‌ల ప‌నిదినానికి దీపిక అంగీక‌రించ‌లేద‌ని, భారీ పారితోషికం డిమాండ్ చేయ‌డ‌మే గాక త‌న ప‌రివారానికి స్టార్ హోట‌ల్ సేవ‌ల్ని కోరింద‌ని కూడా క‌థ‌నాలొచ్చాయి. అయితే ఇవ‌న్నీ అశుభ‌క‌ర‌మైన ప‌రిణామాలు అనుకుంటే, ఇప్పుడు దీపిక నోట శుభ‌క‌ర‌మైన వార్త వెలువ‌డ‌నుంద‌ని స‌మాచారం.

త్వ‌ర‌లోనే దీపిక ప‌దుకొనే సోద‌రి అనీషా ప‌దుకొనే ఓ ఇంటిది కాబోతోంది. ప్ర‌ముఖ బిజినెస్ మేన్ రోష‌న్ ఆర్య‌ను అనీషా పెళ్లాడ‌బోతోంది. రోష‌న్ తో చాలా కాలంగా అనీషాకు ప‌రిచ‌యం ఉంది. ఆ ఇద్ద‌రూ ఒక‌రినొక‌రు ఇష్ట‌ప‌డుతున్నార‌ని, ఈ జంట క‌ల‌యిక‌కు ర‌ణ్ వీర్ సింగ్ కార‌కుడు అని కూడా గుస‌గుస వినిపిస్తోంది. రోష‌న్ ఎవ‌రు? అంటే... పాపుల‌ర్ ఫిలింమేక‌ర్ బిమల్ రాయ్ మునిమనవడు. సన్నీ డియోల్ కుమారుడు కరణ్ డియోల్‌ను పెళ్లాడిన  దిశా ఆచార్యకు స్వ‌యానా సోద‌రుడు. 

ఒక మంచి కుటుంబంతో దీపిక ప‌దుకొనే కుటుంబం సంబంధం క‌లుపుకుంటోంద‌ని, ఇది ప‌దుకొనే ఫ్యామిలీలో ఆనందం నింపుతోంద‌ని గుస‌గుస వినిపిస్తోంది. అయితే ఈ పెళ్లి గురించి ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డాల్సి ఉంది. ప్ర‌ముఖ బ్యాడ్మింట‌న్ క్రీడాకారుడు ప్ర‌కాష్ ప‌దుకొనే కుమార్తె అనీషా ప‌దుకొనే. త‌న సోద‌రి దీపిక ప‌దుకొనే కంపెనీల‌ను అనీషా నిర్వ‌హిస్తోంది. 

Read Entire Article