Akhanda 2 Release: 'అఖండ 2' రిలీజ్... ఇప్పుడున్న ఆప్షన్స్ ఏంటి? ఎప్పుడొస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయ్?
1 hour ago 1
ARTICLE AD
Akhanda 2 Release Date Postponed: డిసెంబర్ 5న థియేటర్లలోకి రావాల్సిన గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ 'అఖండ 2 తాండవం' వాయిదా పడిన సంగతి తెలిసిందే. అందుకు గల కారణాలు ఏమిటో చదవండి ('అఖండ 2' వాయిదాకు కారణాలు... మద్రాస్ హైకోర్టులో, ల్యాబ్ దగ్గర ఏం జరిగింది?). చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ కొత్త విడుదల తేదీని అనౌన్స్ చేస్తామని పేర్కొంది. ఇప్పుడు వాళ్ళ ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఎప్పుడొస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? అనేది చూస్తే...
డిసెంబర్ 12న నో కాంపిటీషన్!
'అఖండ 2 తాండవం' డిసెంబర్ 5న విడుదలకు సిద్ధం కావడంతో... ఆ సినిమా వచ్చిన మరుసటి వారం థియేటర్లలోకి పెద్ద సినిమాలు ఏవీ ప్లాన్ చేయలేదు. ఓ అరడజను చిన్న సినిమాలు రెడీ అయ్యాయి. నందు 'సైక్ సిద్ధార్థ్', సుమ కనకాల తనయుడు రోషన్ 'మోగ్లీ', తమిళ్ హీరో కార్తీ 'అన్నగారు వస్తారు' సహా 'ఈషా', 'డ్రైవ్', 'సఃకుటుంబానాం' థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. డిసెంబర్ 12న వచ్చే ఈ సినిమాలు ఏవీ బాలకృష్ణ సినిమాకు కాంపిటీషన్ కావు. అందువల్ల, నెక్స్ట్ వీక్ మూవీ రిలీజ్ కావడం పెద్ద సమస్య కాదు. కానీ, అప్పటికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయా? అంటే ఛాన్స్ లేదని ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి వినబడుతోంది.
ఆ తర్వాత 'అవతార్ 2' ఉందిగా!
డిసెంబర్ 12న వదిలేసి... డిసెంబర్ 19న వద్దామంటే ఆ రోజు 'అవతార్ 2' రిలీజ్ ఉంది. అమెరికాలో స్క్రీన్స్ దొరకడం కష్టం. ఓవర్సీస్ రిలీజ్ మీద ఆశలు పూర్తిగా వదులుకోవాలి. ఇండియాలోనూ 'అవతార్ 2' మీద విపరీతమైన క్రేజ్ ఉంది. సో, ఇక్కడ కూడా కాంపిటీషన్ ఉంటుంది. అందుకని, డిసెంబర్ 18 లేదా 19న రిలీజ్ అనేది మంచి ఆప్షన్ కాదు. డిస్ట్రిబ్యూటర్లు సైతం ఆ రోజు వద్దని చెప్పారట.
క్రిస్మస్ బరిలో వచ్చే ఛాన్స్ ఎంత?
'అఖండ 2' విడుదలకు నిర్మాతల ముందున్న ఆప్షన్లలో క్రిస్మస్ రిలీజ్ ఒక్కటి. ఈ నెల 25న శ్రీకాంత్ తనయుడు రోషన్ 'ఛాంపియన్', ఆది సాయి కుమార్ 'శంబాల', నవదీప్ - శివాజీల 'దండోరా', మరో చిన్న సినిమా 'పతంగ్' ఉన్నాయి. ఆ సినిమాలు ఏవీ 'అఖండ 2'కు కాంపిటీషన్ ఇచ్చేవి కాదు. పైగా, క్రిస్మస్ హాలిడేస్ కూడా కలిసి వస్తాయి. అందువల్ల డిసెంబర్ 25 అనేది మంచి ఆప్షన్.
సంక్రాంకి వస్తే ఎలా ఉంటుంది?
'అఖండ 2 తాండవం' సినిమాను సంక్రాంతి బరిలో విడుదల చేస్తే బావుంటుందని అభిమానుల నుంచి రిక్వెస్టులు వస్తున్నాయి. నిజానికి నిర్మాతల ముందున్న రిలీజ్ డేట్ ఆప్షన్లలో సంక్రాంతికి కూడా ఒకటి. అయితే... సంక్రాంతి బరిలో పోటీ ఎక్కువగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వర ప్రసాద్ గారు', రెబల్ స్టార్ ప్రభాస్ 'ది రాజా సాబ్', మాస్ మహారాజా 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి', కోలీవుడ్ స్టార్ ఇళయ దళపతి విజయ్ 'జన నాయకుడు' ఉన్నాయి.
సంక్రాంతికి ఎన్ని సినిమాలు విడుదలైనా సరే తెలుగులో ఆదరణ బావుంటుంది. అయితే సోలో రిలీజ్ టైంలో వచ్చినట్టు భారీ ఓపెనింగ్స్ లేదా కలెక్షన్స్ రావడం కష్టం. ఆ ఒక్కటీ ఆలోచించాల్సిన విషయం. అయితే ప్రస్తుతానికి నిర్మాతల ముందు ఉన్న మంచి ఆప్షన్ / రిలీజ్ డేట్... డిసెంబర్ 25. ఒకవేళ ఆ తేదీకి సినిమా రిలీజ్ కాకపోతే జనవరి 9న రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందట. సినిమా వాయిదా పడటం వల్ల ఓవర్సీస్ రిలీజ్ మీద ఇంపాక్ట్ కావచ్చు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. బాలయ్య క్రేజ్, బోయపాటి శ్రీనుతో కాంబినేషన్ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్.
Also Read: Bhuta Shuddhi Vivaha: భూత శుద్ధి వివాహం అంటే ఏమిటి? సమంత - రాజ్ పెళ్లి ఏ పద్ధతిలో, ఎలా జరిగిందో తెలుసా?
Read Entire Article