దిష్టి , ప్రతికూల శక్తిని తొలగించేందుకు 5 రహస్య పరిహారాలు!
6 days ago 2
ARTICLE AD
Kalashtami 2026 Upay: కాలాష్టమి రోజు శివుని ఉగ్ర రూపమైన కాల భైరవుని పూజిస్తారు. ప్రతి నెలా కృష్ణ పక్షం (చీకటి పక్షం) ఎనిమిదవ రోజున కాలాష్టమి వస్తుంది. హిందూ గ్రంథాలలో, కాల భైరవుడు కాశీకి రక్షకుడిగా ,అన్ని కష్టాలను జయించే దైవంగా పూజిస్తారు. ప్రతికూల శక్తి , దిష్టి నుంచి విముక్తి పొందడానికి కాలాష్టమి రోజు చాలా అనుకూలమైనది. ఏప్రిల్ నెలలో వచ్చే కాలాష్టమి పండుగ 2026 ఏప్రిల్ 10వ తేదీ శుక్రవారం వస్తుంది. మీరు చేపట్టే పనిలో తరచూ అడ్డంకులు ఎదురవుతున్నా, ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతున్నా లేదా మీ ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తున్నా, అప్పుడు కాలాష్టమి నాడు చేసే కొన్ని రహస్య పరిహారాలు మీకు గొప్ప ఉపశమనాన్ని ఇస్తాయి, వాటి గురించి తెలుసుకుందాం.
మాసిక కాలాష్టమి రోజు దిష్టి దోషానికి పరిహారాలు
నల్ల దారం
కాలాష్టమి రోజున కాల భైరవ ఆలయాన్ని సందర్శించి, ఆయన పాదాల వద్ద కొద్దిగా కుంకుమను నల్లని గీతలా పెట్టండి. "ఓం హ్రీం బటుకాయ అపదుద్ధరణాయ కురు కురు బటుకాయ హ్రీం" అనే భైరవ మంత్రాన్ని జపిస్తూ, ఈ దారాన్ని కుడి మణికట్టుకు లేదా మెడకు ధరించడం శుభప్రదంగా భావిస్తారు. ఈ నల్ల దారం ఒక రక్షణ కవచంలా పనిచేసి, దిష్టి నుంచి కాపాడుతుందని నమ్మకం
ఆవనూనె దీపం పరిహారం
కాలాష్టమి రోజున, ఇంటి ప్రధాన ద్వారం వద్ద నాలుగు వైపులా ఆవనూనె దీపాన్ని వెలిగించండి. ఈ దీపం జ్వాల ద్వారా కాటుక తయారు చేసుకోండి. ఈ కాటుకను పిల్లల  ఇంటిలోని ఇతర సభ్యుల చెవుల వెనుక పెట్టండి. కాలాష్టమి రోజున భైరవుని ముందు వెలిగించిన దీపం  కాటుకను ఉపయోగించడం ద్వారా, దిష్టి సమస్య తక్షణమే నయమవుతుంది.
దిష్టి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి కాల భైరవ స్వామి  ఈ మంత్రాన్ని జపించండి.
కాలాష్టమి రోజున, 'ఓం కాలభైరవాయ నమః' అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. జపిస్తున్నప్పుడు ముందుగా దేవుడి దగ్గర దీపం వెలిగించి నమస్కరించి అప్పుడు జపించండి
కాలాష్టమి రోజున తప్పకుండా ఆచరించాల్సినవి
కాలాష్టమి రోజున నల్ల కుక్కకు   రొట్టె ఆహారంగా వేయండి.. అలా చేయడం వల్ల దిష్టి పోతుంది
ఈ రోజున తామసిక ఆహారాన్ని పూర్తిగా మానేయండి
మీ శక్తి మేరకు నిరుపేదలకు బట్టలు, ఆహారం దానం చేయండి
కాలాష్టమి రాత్రి ఎందుకు అంత శక్తివంతమైనది?
బహుళపక్షంలో వచ్చే అష్టమి కాబట్టి..ఆ తర్వాత సమీపిస్తున్న అమావాస్య కారణంగా రాత్రి చీకటి చాలా తీవ్రంగా ఉంటుంది. తంత్ర సాధనలో, చీకటిని ఒక శూన్యంగా భావిస్తారు, దాని నుంచి నూతన శక్తి పుడుతుంది. ఈ సమయంలో, రాక్షస  -  ఆధ్యాత్మిక శక్తులు రెండూ క్రియాశీలమవుతాయి, వీటిని సాధకులు మంత్రాల ద్వారా మేల్కొలుపుతారు.
మనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
Read Entire Article