ARTICLE AD
యంగ్ హీరో నారా రోహిత్ గత ఏడాది తను ప్రేమించిన శిరీష లెల్ల ను పెద్దల అంగీకారంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఎంగేజ్మెంట్ అయిన ఏడాదికి నారా రోహిత్ - శిరీష ల వివాహం జరిగింది. నారా రోహీత్ తండ్రి మరణంతో వాయిదా పడిన రోహిత్ వివాహం గతఏడాది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దంపతుల చేతుల మీదుగా గ్రాండ్ గా నిర్వహించారు.
ఇప్పుడు నారా రోహిత్-శిరీష్ దంపతులు పేరెంట్స్ గా ప్రమోట్ కాబోతున్నారు. నారా రోహిత భార్య శిరీష్ ప్రెగ్నెంట్. అదే విషయం రీసెంట్ గా వారు ఓ వివాహ వేడుకలో పాల్గొన్నప్పుడు శిరీష్ ప్రెగ్నెంట్ అన్న విషయం ఆమె బేబీ బంప్ చూస్తే తెలుస్తుంది. దానితో నారా రోహిత్ దంపతులకు అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
త్వరలోనే నారా రోహిత్ తండ్రి కాబోతున్నాడు. ఇక నారా రోహిత్ గత ఏడాది భైరవం తర్వాత మరో ప్రాజెక్ట్ చెయ్యలేదు. త్వరలోనే నారా రోహిత్ కొత్త మూవీ ని ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తుంది.

1 month ago
5