Tata cars september 2026 discounts: కారు కొనాలని ప్లాన్ చేస్తున్నవాళ్లకు ఇది మంచి అవకాశం. టాటా మోటార్స్, ఈ నెలలో (సెప్టెంబర్ 2026), పెట్రోల్ & డీజిల్ కార్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈ నెలలో టాటా కార్లపై గరిష్ఠంగా రూ.1.25 లక్షల వరకు ప్రయోజనాలు పొందొచ్చు. ఈ ఆఫర్లలో డిస్కౌంట్, స్క్రాపేజ్ బెనిఫిట్, లాయల్టీ బెనిఫిట్ వంటి ప్రయోజనాలు కలిసి ఉన్నాయి.

అయితే, అన్ని టాటా కార్లపై ఆఫర్లు లేవు. Tata Punch & 2026 Tata Tiago మినహా ఇతర ICE కార్లపై ఆఫర్లను ప్రకటించారు. ముఖ్యంగా.. Tata Curvv & Tata Nexon పై ఆకర్షణీయమైన ప్రయోజనాలు లభిస్తాయి. ఇటీవల పెరిగిన కార్ల ధరల భారాన్ని ఈ ఆఫర్లు కొంతమేర తగ్గించనున్నాయి.

Tata Curvv పై గరిష్ఠంగా రూ.1.25 లక్షల ప్రయోజనం

టాటా కర్వ్‌పై ఈ నెలలో గరిష్ఠంగా రూ.1.25 లక్షల వరకు ప్రయోజనం పొందొచ్చు. ఇందులో రూ.30,000 డిస్కౌంట్ ఉంది. మరో రూ.45,000 స్క్రాపేజ్ బెనిఫిట్ లభిస్తుంది. లాయల్టీ బెనిఫిట్ కింద రూ.50,000 వరకు ప్రయోజనం ఉంది. ఇటీవల, కర్వ్ వేరియంట్ లైనప్‌లో కూడా టాటా కంపెనీ కొన్ని మార్పులు చేసింది. ప్రారంభ & మధ్య స్థాయి వేరియంట్లలో మరిన్ని ఫీచర్లను జోడించింది.

Tata Nexon పై రూ.75,000 వరకు బెనిఫిట్

నెక్సాన్ కొనుగోలుదారులకు కూడా టాటా మోటార్స్ మంచి ఆఫర్ ప్రకటించింది. గరిష్ఠంగా రూ.75,000 వరకు ప్రయోజనం పొందొచ్చు. పెట్రోల్ మాన్యువల్‌లోని కొన్ని వేరియంట్లపై రూ.10,000 డిస్కౌంట్, రూ.45,000 ఇంటర్వెన్షన్ ఆఫర్ & రూ.20,000 స్క్రాపేజ్ బెనిఫిట్ ఉన్నాయి.

ఇతర పెట్రోల్ వేరియంట్లపై రూ.55,000 వరకు ప్రయోజనం లభిస్తుంది. ఇందులో రూ.10,000 డిస్కౌంట్, రూ.25,000 ఇంటర్వెన్షన్ ఆఫర్ & రూ.20,000 స్క్రాపేజ్ బెనిఫిట్ ఉన్నాయి.

నెక్సాన్ CNGపై రూ.60,000 వరకు ప్రయోజనం ఉంది. ఇందులో రూ.10,000 డిస్కౌంట్, రూ.25,000 ఇంటర్వెన్షన్ ఆఫర్ & రూ.25,000 స్క్రాపేజ్ బెనిఫిట్ ఉన్నాయి. డీజిల్ నెక్సాన్‌పై రూ.20,000 స్క్రాపేజ్ బెనిఫిట్ అందుబాటులో ఉంది.

Tata Altroz పై రూ.55,000 వరకు ఆఫర్

టాటా ఆల్ట్రోజ్‌పై కూడా గరిష్ఠంగా రూ.55,000 వరకు ప్రయోజనం ఉంది. స్మార్ట్ వేరియంట్ మినహా పెట్రోల్ మోడళ్లపై రూ.35,000 వరకు ఆఫర్ లభిస్తుంది. ఇందులో రూ.15,000 డిస్కౌంట్ & రూ.20,000 స్క్రాపేజ్ బెనిఫిట్ ఉన్నాయి.

ఆల్ట్రోజ్ CNGపై రూ.55,000 వరకు ప్రయోజనం లభిస్తుంది. ఇందులో రూ.15,000 డిస్కౌంట్, రూ.20,000 ఇంటర్వెన్షన్ ఆఫర్ & రూ.20,000 స్క్రాపేజ్ బెనిఫిట్ ఉన్నాయి. డీజిల్ వేరియంట్లపై రూ.35,000 వరకు ప్రయోజనం ఉంది.

ఇది కూడా చదవండి: రూ.1.35 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తున్న మారుతి సుజుకీ విక్టోరిస్.. ఆ మోడల్ ప్రత్యేకం

Tata Harrier & Tata Safari పై రూ.45,000 వరకు

టాటా హారియర్ డీజిల్‌పై రూ.45,000 వరకు ప్రయోజనం పొందొచ్చు. ఇందులో రూ.10,000 డిస్కౌంట్ & రూ.35,000 స్క్రాపేజ్ బెనిఫిట్ ఉన్నాయి. అయితే టర్బో పెట్రోల్ వేరియంట్లపై ఎలాంటి డిస్కౌంట్ లేదు.

టాటా సఫారి డీజిల్‌పైనా రూ.45,000 వరకు ప్రయోజనం ఉంది. హారియర్ తరహాలోనే రూ.10,000 డిస్కౌంట్ & రూ.35,000 స్క్రాపేజ్ బెనిఫిట్ అందుబాటులో ఉన్నాయి. సఫారి టర్బో పెట్రోల్ మోడళ్లకు మాత్రం ఈ ఆఫర్ వర్తించదు.

Pre-2026 Tata Tiago పై రూ.35,000 వరకు బెనిఫిట్

2026కి ముందు తయారైన టాటా టియాగో స్టాక్‌పై రూ.35,000 వరకు ప్రయోజనం లభిస్తుంది. XE మినహా పెట్రోల్ వేరియంట్లపై రూ.15,000 డిస్కౌంట్, రూ.5,000 ఇంటర్వెన్షన్ ఆఫర్ & రూ.15,000 స్క్రాపేజ్ బెనిఫిట్ ఉన్నాయి. ఇదే ఆఫర్ CNG వెర్షన్‌లోనూ అందుబాటులో ఉంది.

Tata Tigor & Tata Sierra పైనా ఆఫర్లు

టాటా టిగోర్‌పై గరిష్ఠంగా రూ.30,000 వరకు ప్రయోజనం ఉంది. ఇందులో రూ.15,000 డిస్కౌంట్ & రూ.15,000 స్క్రాపేజ్ బెనిఫిట్ ఉన్నాయి.

టాటా సియెరాపై కూడా రూ.30,000 వరకు ప్రయోజనం పొందొచ్చు. పెట్రోల్ & డీజిల్ రెండు వెర్షన్లకు ఈ బెనిఫిట్ వర్తిస్తుంది. డిస్కౌంట్, స్క్రాపేజ్ లేదా లాయల్టీ బెనిఫిట్ రూపంలో ఈ ప్రయోజనం అందుతుంది.

ఇది కూడా చదవండి: 2026 మారుతి బలెనో కొనేందుకు కనీసం ఎంత డబ్బు కావాలి? తెలంగాణ, ఏపీ ధరలు & లోన్ వివరాలు ఇవే!

ఈ ఆఫర్లు సెప్టెంబర్ 30 వరకు అందుబాటులో ఉంటాయి. నగరం, డీలర్‌షిప్, స్టాక్‌ను బట్టి ప్రయోజనాల్లో మార్పులు ఉండొచ్చు. టాటా కారు కొనుగోలు చేసే ముందు సమీపంలోని టాటా డీలర్‌షిప్‌లో ఖచ్చితమైన ఆఫర్‌ను తెలుసుకోవడం మంచిది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.