చైత‌న్య‌తో సామ్ విభేధాల‌పై అమ‌ల‌

1 week ago 1
ARTICLE AD

అక్కినేని నాగ‌చైత‌న్య, స‌మంత జంట ప్రేమ పెళ్లి చివ‌రికి విడాకుల‌తో ముగియ‌డం అభిమానులు ఎప్ప‌టికీ జీర్ణించుకోలేనిది. కానీ విధిని ఎవ‌రూ మార్చ‌లేరు. ప్ర‌స్తుతం ఆ ఇద్ద‌రూ ఎవ‌రి దారిలో వారున్నారు. నాగ‌చైత‌న్య అందాల క‌థానాయిక‌, తెలుగ‌మ్మాయి శోభిత ధూళిపాల‌ను వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. సామ్ ప్ర‌స్తుతం కెరీర్ పై దృష్టి సారించింది.

 

తాజాగా ఎన్డీటీవీ పాడ్ కాస్ట్ లో స‌మంత‌, చైతూ మ‌ధ్య వైరుధ్యాల గురించి అమ‌ల అక్కినేని స్ప‌ష్ఠంగా మాట్లాడారు. నాగ‌చైత‌న్య బాల్యంలో చెన్నైలో త‌న త‌ల్లి వ‌ద్ద పెరిగారు. కాలేజ్ చ‌దువుల కోసం హైద‌రాబాద్ కి వ‌చ్చాడు. అత‌డు త‌న‌కు ముందే తెలిసినా కానీ, హైద‌రాబాద్ కి వ‌చ్చాకే బాగా అర్థ‌మ‌య్యాడ‌ని అమ‌ల తెలిపారు. చైత‌న్య‌ మంచి యువ‌కుడు. తెలివైన వాడు. మృధువైన వాడు. తండ్రి మాట జ‌వ‌దాట‌ని వాడు. సొంత ఆలోచ‌న‌లు తెలివితేట‌లు ఉన్న యువ‌కుడు. అయితే రెండు కుటుంబాల మ‌ధ్య అత‌డి బాల్యం గ‌డిచింది. అది అత‌డి బాల్యంలో ఎమోష‌న‌ల్ గ్లిచ్. అత‌డు పెరిగి పెద్ద‌వాడ‌య్యాక‌, ఒక అంద‌మైన ప్రేమ‌గ‌ల స్థిర‌మైన కుటుంబాన్ని సృష్టించాల‌ని ఆశ‌ప‌డ్డాడు. కానీ స‌మంత త‌న కెరీర్ పై దృష్టి సారించింద‌ని అమ‌ల అక్కినేని వ్యాఖ్యానించారు. క‌నీసం శోభిత అత‌డిలో ఆ భాగాన్ని అర్థం చేసుకోవాలని, స్థిర‌మైన కుటుంబం కోసం స‌హ‌క‌రించాల‌ని కూడా కోరారు. అమ‌ల అక్కినేని నాగ‌చైత‌న్య ఎదిగే క్ర‌మంలో ఎదుర్కొన్న విష‌యాల‌ను అమ‌ల ఈ పాడ్ కాస్ట్ లో చాలా స్ప‌ష్ఠంగా మాట్లాడారు. చైత‌న్య.. శోభిత‌ను పెళ్లాడాక చాలా సంతోషంగా ఉన్నాడు. ఇటీవ‌ల‌ కెరీర్ పై పూర్తి స్థాయిలో దృష్టి సారించిన సంగ‌తి తెలిసిందే.

Read Entire Article