Hardik Pandya T20 Wickets: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భాగంగా హార్దిక్ పాండ్యా అరుదైన ఘనత సాధించారు. మూడో T20 మ్యాచ్‌లో పాండ్యా ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ T20 క్రికెట్‌లో 1000 పరుగులు, 100 వికెట్లు తీసిన ప్రపంచంలోనే తొలి ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికా బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్‌ను అవుట్ చేయడం ద్వారా ఈ ఘనత సాధించాడు. దీంతో పాటు హార్ధిక్ పాండ్యా T20 క్రికెట్‌లో వికెట్ల పరంగా ఒక ప్రత్యేక రికార్డును కూడా నెలకొల్పాడు.

ధర్మశాలలో జరిగిన మూడో T20 మ్యాచ్‌కు ముందు హార్దిక్ పాండ్యా తన T20 కెరీర్‌లో 99 వికెట్లు ఉన్నాయి. ట్రిస్టన్ స్టబ్స్‌ను ఔట్ చేయడంతో, అతను T20 ఫార్మాట్‌లో సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన మూడో భారత బౌలర్‌గా నిలిచాడు. అతని కంటే ముందు అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా T20 ఇంటర్నేషనల్‌లో భారత్ తరపున 100 వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్లుగా నిలిచారు.

1000 పరుగులు, 100 వికెట్లు

అంతర్జాతీయ T20 క్రికెట్‌లో బ్యాటింగ్‌లో వెయ్యి పరుగులు, 100 వికెట్లు తీసిన ప్రపంచంలోనే తొలి ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా.

అప్‌డేట్ కొనసాగుతోంది...