గ‌ల్ఫ్ యుద్ధంలో స్ట‌క్.. టెన్ష‌న్‌లో స్టార్లు

1 month ago 6
ARTICLE AD

ప్రస్తుత పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు దుబాయ్ లో చిక్కుకుపోయిన సంగ‌తి తెలిసిందే. తాను ఉన్న దుబాయ్ విమానాశ్ర‌యం స‌మీపంలో భారీ విస్పోట‌నం సంభ‌వించింద‌ని, అక్క‌డికి ద‌గ్గ‌ర‌గా ఉన్న త‌న కోచ్ ప‌రుగులంకించుకున్నార‌ని, ప్ర‌స్తుతం సుర‌క్షిత ప్ర‌దేశాన్ని వెతుకుతున్నామ‌ని పివి సింధు త‌న సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించ‌డంతో భార‌త‌దేశంలో అలాగే హైద‌రాబాద్ లో టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది.

మరోపక్క హీరో మంచు విష్ణు దుబాయ్ లో నివాసముంటున్న ఇంటి కి దగ్గరలో బాంబు బ్లాస్ట్ అవ్వగా తన ఇల్లు, ఇంకా ప్రాంతాలు కంపించాయని వీడియో షేర్ చేసారు. 

ఇరాన్ పై అమెరికా- ఇజ్రాయేల్ అల‌యెన్స్ దాడుల నేప‌థ్యంలో గ‌ల్ఫ్ మొత్తం టెన్ష‌న్ వాతావ‌ర‌ణం అలుముకుంది. గ‌ల్ఫ్ లో చిక్కుకున్న వారిలో బాల‌య్య హీరోయిన్ సోనాల్ చౌహాన్, తెలుగులో ప‌లు చిత్రాల‌లో న‌టించిన‌ రిచా ప‌నాయ్ సహా ప‌లువురు భార‌తీయ సెల‌బ్రిటీలు ఉన్నారు. వీరంతా ప‌శ్చిమ దేశాల‌లో చిక్కుకుపోయారు. యుద్ధ మేఘాల న‌డుమ‌ భ‌యాందోళ‌న‌లో ఉన్నారు.. 

Read Entire Article