ఖాన్ వార‌సుడితో ప్రియురాలు బ్రేక‌ప్

3 weeks ago 2
ARTICLE AD

కింగ్ ఖాన్ వార‌సుడు ఆర్య‌న్ ఖాన్ `ది బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్` వెబ్ సిరీస్ తో ద‌ర్శ‌కుడిగా ఆరంగేట్రం చేసిన సంగ‌తి తెలిసిందే. అత‌డు త‌న ప్ర‌తిభ‌తో ఆరంభ‌మే మ‌న‌సులు గెలుచుకున్నాడు. వెబ్ సిరీస్ లో సెల‌బ్రిటీల‌పై సెటైరిక‌ల్ డ్రామాను క్రిటిక్స్ ప్ర‌శంసించారు. ఈ విజ‌యోత్స‌వ వేళ ఈసారి ఆర్యన్ ఖాన్ 28వ బ‌ర్త్ డే అత్యంత ప్ర‌త్యేకంగా మారింది.

అయితే ఈ పుట్టిన‌రోజు శుభ సంద‌ర్భంలో అత‌డికి ప్రియురాలు లారిస్సా బోనెస్సీ దూర‌మైందంటూ ఒక పుకార్ షికార్ చేస్తోంది. దీనికి కార‌ణం ఆర్య‌న్ కి ఇప్ప‌టివ‌ర‌కూ లారిస్సా పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు చెప్ప‌క‌పోవ‌డ‌మే. ఈ బ్రెజిలియ‌న్ బ్యూటీకి బ‌దులుగా అన‌న్య పాండే, షాన‌యా క‌పూర్ వంటి భామ‌లు ఆర్య‌న్ ఖాన్ కి హృద‌య‌పూర్వ‌కంగా పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు చెప్పారు. అన‌న్య కాస్త కొంటెగా ఆర్య‌న్ ఖాన్ ని టీజ్ చేస్తూ బ‌ర్త్ డే విషెస్ తెలిపింది. ఇక అనన్య పాండే కుటుంబ స‌భ్యులు స‌హా షాన‌యా క‌పూర్ ఆమె కుటుంబీకులు కూడా ఆర్య‌న్ ఖాన్ కి విషెస్ తెలిపారు.

అయితే లారిస్సా సంద‌డి లేక‌పోవ‌డంతో ప్రియురాలితో ఆర్య‌న్ కి బ్రేక‌ప్ అయింద‌న్న పుకార్ జోరుగా వైర‌ల్ అయిపోతోంది. లారిస్సా బోనెస్సీ ఇంత‌కుముందు సాయి తేజ్ నటించిన `తిక్క` చిత్రంలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. సినిమా ఫ్లాపైనా కానీ, లారిస్సా అంద‌చందాలు కుర్ర‌కారు గుండెల్లో గిలిగింత‌లు పెట్టాయి. లారిస్సా బాలీవుడ్ లో కొన్ని వెబ్ సిరీస్ లు, సింగిల్ ఆల్బ‌మ్స్ లో న‌టించింది. ప‌లు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లతోను ఈ విదేశీ బ్యూటీ పాపుల‌రైంది. 

Read Entire Article