ఐఎండీబీ లో దుమ్మురేపిన కన్నడ హీరోయిన్స్

1 day ago 1
ARTICLE AD

ఈమధ్యన సౌత్ లో కన్నడ భామల జోరు మాములుగా లేదు. కన్నడ నుంచి వచ్చిన రష్మిక మందన్న పాన్ ఇండియా మార్కెట్ ని ఏలుతోంది. అటు కాంతార 2తో పాన్ ఇండియా మర్కెట్ లో వెలిగిపోయింది రుక్మిణి వసంత్. ఇప్పుడు ఈ ఇద్దరు హీరోయిన్స్ ఐఎండీబీ మోస్ట్ పాపులర్ యాక్టర్-2025 లిస్ట్ లో బాలీవుడ్ యాక్టర్స్ సరసన నిలిచి దుమ్ము రేపారు. 

ఐఎండీబీ తాజాగా మోస్ట్ పాపులర్ యాక్టర్-2025 లిస్ట్ ని రిలీజ్ చేసింది. అందులో ఈ ఏడాది వరస సినిమాలే కాదు, వరస హిట్స్ తో దూసుకుపోయిన రష్మిక మందన్న, కాంతార 2 తో పాన్ ఇండియాలో హిట్ కొట్టిన రుక్మిణి వసంత్,  హీరో రిషబ్ శెట్టి లు  బాలీవుడ్ నటుల సరసన నిలిచి అందరికి షాకిచ్చారు. 

ఈ ఏడాది అనూహ్య విజయాలతో హైలెట్ అయిన సయారా హీరోయిన్ అహాన్ పాండే, అనీత్ పడ్డా ఫస్ట్ టు ప్లేసెస్ ని తీసుకోగా.. ఆమీర్, ఇషాన్ ఖట్టర్, లక్ష్య, రష్మిక, మలయాళ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శి, కన్నడ రుక్మిణి వసంత్, రిషబ్ శెట్టి , త్రిప్తి డిమ్రి లో టాప్ 10 ఐఎండీబీ మోస్ట్ పాపులర్ యాక్టర్-2025 లిస్ట్ నిలిచారు. 

Read Entire Article