ఐ-బొమ్మను పట్టించిన విడాకుల కేసు

2 weeks ago 2
ARTICLE AD

``ద‌మ్ముంటే ప‌ట్టుకోండి చూద్దాం!`` అంటూ పోలీసుల‌కు స‌వాల్ విసిరిన `ఐబొమ్మ` నిర్వాహ‌కుడు ఇమ్మ‌డి ర‌విని కూక‌ట్ ప‌ల్లి పోలీసులు చాక‌చ‌క్యంగా ప‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే. నెల‌ల త‌రబ‌డి సైబర్ క్రైమ్ సీసీఎస్ పోలీసులు వ‌ల ప‌న్ని ఐబొమ్మ ర‌విని ఎట్ట‌కేల‌కు కూక‌ట్‌ప‌ల్లిలోని ఒక అపార్ట్ మెంట్‌లో ప‌ట్టుకున్నారు. అత‌డు క‌రేబియ‌న్ దీవుల నుంచి పైరసీ వ్య‌వ‌హారాల్ని న‌డిపిస్తున్నాడ‌ని పోలీసులు ఇప్ప‌టికే అంచ‌నా వేసారు. ప్ర‌స్తుతం ఐబొమ్మ‌, బ‌ప్పం పేరుతో అత‌డు న‌డుపుతున్న‌ పైర‌సీ సైట్ల‌ను పోలీసులు బ్లాక్ చేసారు. అలాగే ర‌వి బ్యాంక్ ఖాతా నుంచి 3 కోట్లు సీజ్ చేసిన‌ట్టు తెలిసింది. అతడు ప‌లు బెట్టింగ్ యాప్ ల నుంచి భారీగా నిధులు స‌మీక‌రించి ఉంటాడ‌ని కూడా పోలీసులు భావిస్తున్నారు.

 

ఆస‌క్తిక‌రంగా ఐబొమ్మ ర‌వి దొరికిపోవ‌డానికి ఒక ప్ర‌ధాన కార‌ణం ఉంద‌ని పోలీస్ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. కాపురంలో క‌ల‌త‌లే ఈరోజు అత‌డిని ప‌ట్టించాయ‌ని పోలీసులు పేర్కొన్న‌ట్టు గుస‌గుస వినిపిస్తోంది. భార్య‌తో విడాకుల కేసు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యేందుకు అత‌డు క‌రేబియ‌న్ దీవుల నుంచి నేరుగా హైద‌రాబాద్ కూక‌ట్ ప‌ల్లిలో అడుగుపెట్టాడు. తాను ఇక్క‌డికి వ‌చ్చినా ఎవ‌రూ గుర్తుప‌ట్ట‌లేర‌ని ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. అయితే నెల‌ల త‌ర‌బ‌డి అత‌డి కోసం కాపు కాసుకుని కూచున్న సీసీఎస్ పోలీసులు అత‌డిని అనునిత్యం ట్రాక్ చేస్తూ, అతడి ప్ర‌యాణ క‌ద‌లిక‌ల‌ను ఆరా తీస్తూ ఎట్ట‌కేల‌కు కూకట్ ప‌ల్లిలో అరెస్ట్ చేసారు. కూక‌ట్ ప‌ల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకుల కేసు విచార‌ణ‌కు వ‌చ్చాడు గ‌నుక‌నే దొరికాడు! అంటూ ఇప్పుడు ఒక గుస‌గుస వైరల్‌గా మారుతోంది.

Read Entire Article