ARTICLE AD
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కొనసాగుతూ సినిమాల్లోకి కమ్ బ్యాక్ అయ్యాక పవన్ కి నీడలా వెన్నంటి ఉంటున్నారు ఆయన స్నేహితుడు దర్శకుడు త్రివిక్రమ్. పవన్ ఏ సినిమా చేసినా దానిలో త్రివిక్రమ్ పాత్ర ఉంటుంది. వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో, వీరమల్లు, OG ఇలా ప్రతి సినిమాలో త్రివిక్రమ్ ఏదో విధంగా ఆ సినిమాలతో కనెక్ట్ అవుతున్నారు.
ఇప్పుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన ఉస్తాద్ భగత్ సింగ్ లోను త్రివిక్రమ్ పాత్ర ఉన్నట్టుగా తాజాగా హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ ఇంటర్వ్యూ లో రివీల్ చేసారు. ఉస్తాద్ భగత్ సింగ్ కోసం త్రివిక్రమ్ గారు మాట సహాయం చేశారు. అయితే నెక్స్ట్ మూవీ కి కూడా ఆయనని మాటల సహాయం చేయమని అడుగుదామనుకొంటున్నా అంటూ హరీష్ శంకర్ చెప్పడం హైలెట్ అయ్యింది.
మరి ఉస్తాద్ భగత్ సింగ్ పవర్ ఫుల్ డైలాగ్స్ లో దర్శకుడు త్రివిక్రమ్ వినిపిస్తారన్నమాట. సో ఇకపై పవన్ కళ్యాణ్ ఏ సినిమా చేసినా అందులో త్రివిక్రమ్ పాత్ర ఉంటుంది అనేది ఉస్తాద్ భగత్ సింగ్ తో తేటతెల్లమయ్యింది.

2 months ago
11