ఉస్తాద్ ఈ మాత్రం సరిపోతుంది

2 months ago 10
ARTICLE AD

నిజమే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆకలిమీదున్నారు. ఆయన రాజకీయాల్లోకి వెళ్ళాక సినిమాలు చేస్తున్నా అవి అనుకున్న సమయానికి రిలీజ్ కావడం లేదు. ఏళ్ళ తరబడి సెట్ పైనే ఉంటున్నాయి. ఈమధ్య కాలంలో హరి హర వీరమల్లు, OG, నిన్న విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు ఏళ్ళ తరబడి సెట్ పైన ఉన్నవే. ఎలాగో సినిమాలు విడుదల చేసారు.

నిన్న విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ పై దర్శకుడు విపరీతమైన అంచనాలు పెంచాడు. ఉగాది సందర్భంగా లాంగ్ వీకెండ్ తో విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ కి మిక్స్డ్ రెస్పాన్స్ కనిపిస్తుంది. అయితే హీరో ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్, థమన్ BGM ఉస్తాద్ ని నిలబెట్టాయి. ఫ్యాన్స్ కి కోసమే పవన్ ఎలివేషన్స్ అన్నట్టుగా ఉన్నాయి.

పవన్ ఫ్యాన్స్ కి అవి చాలు, సినిమా అదే లెగుస్తుంది. కొన్ని డైలాగ్స్, పవన్ కళ్యాణ్ లుక్స్, హీరో ఎలివేషన్స్, ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ ఫ్యాన్స్ కి నచ్చేసాయి. కంటెంట్ ఎలా ఉన్నా అభిమానులకు ఈ మాత్రం సరిపోతుంది. కాకపోతే OG లాంటి పవర్ ఫుల్ యాక్షన్ చూసాక ఉస్తాద్ కాస్త లో అనిపిస్తుంది అంటున్నారు.

ఏది ఏమైనా పవన్ ఫ్యాన్స్ ని హరీష్ శంకర్ కూల్ చేసాడనే చెప్పాలి. ఫ్యాన్స్ కి 100 శాతం నచ్చకపోయినా.. 80 శాతం శాటిస్ ఫై అయ్యారు. ఈమాత్రం ఫ్యాన్స్ కి నచ్చినా సినిమా హిట్ పక్కా..

Read Entire Article