Indrakeeladri Kanakadurga Devasthanam: ఆలయంలో నిత్య కైంకర్యాలు, అర్చనలు, పూజలు జరిగే సమయంలో తెలిసి లేదా తెలియక జరిగే దోషాలు, స్పర్శ దోషాలు,లోపాలు,అశుచులు తొలగిపోయి ఆలయ పవిత్రత పరిపూర్ణంగా నిలిచేందుకు ఆగమ శాస్త్రోక్తంగా ఏటా నిర్వహించే విశేష మహోత్సవమే ఈ ‘పవిత్రోత్సవం’. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ‘వార్షిక పవిత్రోత్సవాలు’ ఆగస్టు 27 గురువారం నుంచి అత్యంత శాస్త్రోక్తంగా, వైభవంగా ప్రారంభం కానున్నాయి.

రంగురంగుల పట్టు దారాలతో ప్రత్యేకంగా రూపొందించిన పవిత్ర మాలలను ప్రధాన దేవతలకు,పరివార దేవతలకు ధరింపజేసి, హోమ క్రతువులు నిర్వహించడం ద్వారా ఇంద్రకీలాద్రి క్షేత్రానికి విశేషమైన ఆధ్యాత్మిక తేజస్సు సమకూరుతుందని పురాణోక్తి.

ఉత్సవాల మొదటి రోజైన ఆగస్టు 27 గురువారం తెల్లవారుజామున 3:00 గంటలకు శ్రీ కనకదుర్గ అమ్మవారి ప్రధాన ఆలయంలో శాస్త్రోక్తంగా సుప్రభాత సేవ నిర్వహిస్తారు. అనంతరం శ్రీ అమ్మవారి మూలవిరాట్‌కు అర్చక పండితులు వేద మంత్రోచ్ఛారణల మధ్య దివ్యమైన స్నపనాభిషేకం, పవిత్ర మాలాధారణ మహోత్సవాన్ని జరిపిస్తారు.

ప్రధాన ఆలయంలో సుప్రభాత సేవ, స్నపనాభిషేకం, పవిత్రాలంకరణ క్రతువులు పూర్తయ్యేంత వరకు దర్శనాలు నిలిపేస్తారు. ఉదయం 8:00 గంటల తర్వాతే భక్తులకు శ్రీ అమ్మవారి సర్వదర్శనం కల్పించడం జరుగుతుందని దేవస్థాన ఈవో శీనానాయక్ చెప్పారు

పవిత్రోత్సవాల సందర్భంగా నిర్వహించే వివిధ వైదిక హోమాలు, జపాలు,మూల మంత్ర హవనములు తదితర కార్యక్రమాలకు దేవస్థానం సర్వసన్నద్ధమైంది.

ఉదయాన్నే 5 తులసి ఆకులు నమిలితే కలిగే ఆరోగ్య, ఆధ్యాత్మిక ప్రయోజనాలివే!

పవిత్రోత్సవాల పూర్తి షెడ్యూల్ - దర్శన సమయాల వివరాలు

ప్రధాన ఉత్సవాల షెడ్యూల్ ఆగష్టు 26 బుధవారం సాయంత్రం 4 గంటలకు ఉదకశాంతి కార్యక్రమంతో పవిత్రోత్సవాలు ప్రారంభం

ఆగష్టు 27 గురువారం తెల్లవారుజామున 3 గంటలను సుప్రభాతం, స్నపనాభిషేకం నిర్వహిస్తారు..అనంతరం పవిత్రాల సమర్పణ జరగుతుంది

మూడు రోజుల పాటు జరిగే పవిత్రోత్సవాల్లో భాగంగా ఆగష్టు 27,28,29 తేదీల్లో వైదిక కమిటీ నిర్ణయం ప్రకారం ఉదయం 8 తర్వాతే సర్వదర్శనం కల్పిస్తారు

ప్రతిరోజూ మధ్యాహ్నం సమయంలో పూజా కార్యక్రమాల కోసం దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేస్తారు

సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు మూలమంత్ర హవనాలు, వేద పారాయణాలు, నీరాజన మంత్రపుష్పాలు నిర్వహిస్తారు

పవిత్రోత్సవాలు జరిగే మూడు రోజులు ఆలయంలో ఆర్జిత సేవలు తాత్కాలికంగా రద్దు చేశారు

భక్తుల రద్దీని క్రమబద్దీకరించడానికి , వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించడానికి అంతరాలయ దర్శన సమయాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి

ఆన్ లైన్ టికెట్ల బుకింగ్ లేదా ఇతర వివరాల కోసం భక్తులు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం అధికారిక వెబ్ సైట్ ను దర్శించవచ్చు

ఈ ఉత్సవాల సమయంలో కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నవారికి సకలపాపాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. పవిత్రోత్సవాలు మూడు రోజుల తర్వాత దుర్గమ్మకు సమర్పించిన పవిత్రమాలను భక్తులను ప్రసాదంగా అందిస్తారు. ఇంద్రకీలాద్రి వైభవాన్ని చాటిచెప్పే పవిత్రమైన సంప్రదాయం ఇది.

Gold Price September 2026: సెప్టెంబర్‌లో బంగారం ధరలు పెరుగుతాయా, తగ్గుతాయా? కీలక అంచనా!

Gold Rates: లక్ష్మీ స్వరూపంగా భావించే బంగారం ధరలు భారత్ తో పాటూ ఈ 10 దేశాల్లో మండిపోతున్నాయ్! కారణాలివే!