ఇండియాలో 500కోట్లు వ‌సూల్ సాధ్య‌మేనా

5 days ago 2
ARTICLE AD

2025 కి గుడ్ బాయ్ చెప్పి, 2026లో అడుగుపెడుతున్నాం. ఇప్ప‌టి నుంచే యూత్ డిసెంబ‌ర్ 31 సెల‌బ్రేష‌న్స్ గురించి చాలా ప్లాన్స్ వేస్తోంది. అయితే ఏడాది ముగింపును సెల‌బ్రేట్ చేయ‌టానికి, ఇప్పుడు మ‌రో భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ బొమ్మ చూడ‌గ‌ల‌మా? 500 కోట్ల క్ల‌బ్ (ఇండియాలో) సినిమాని చూడ‌గ‌ల‌మా? ఈ ప్ర‌శ్న‌ల‌కు ఒకే ఒక్క స‌మాధానం- అవ‌తార్ 3 (ఫైర్ అండ్ యాష్).

జేమ్స్ కామెరూన్ అవ‌తార్ ఫ్రాంఛైజీలోని ఈ మూడో భాగం అత్యంత భారీ విజ‌యం సాధిస్తుంద‌ని చాలా న‌మ్మ‌కంగా చెబుతున్నారు. ఇది సుదీర్ఘ నిడివితో ప్ర‌తి ఫ్రేమ్‌లోను ర‌క్తి క‌ట్టిస్తుంద‌ని చెబుతున్నారు. మొద‌టి రెండు భాగాల‌ను మించి ఈ మూడో సినిమా కోసం ఎఫ‌ర్ట్ పెట్టామ‌ని కూడా ప‌దే ప‌దే లీకులిస్తున్నారు. అయితే గ‌తంతో పోలిస్తే ఇప్పుడు ఖ‌ర్చులు పెరిగాయి. వీఎఫ్ఎక్స్ స‌హా ఇత‌ర సాంకేతిక విభాగాల కోసం భారీ మొత్తాల‌ను ఖ‌ర్చు చేయాల్సి వ‌చ్చింద‌ని, అది త‌మ‌పై ఒత్తిడి పెంచింద‌ని కామెరూన్ అంగీక‌రించారు.

అయితే త‌మ శ్ర‌మ తెర‌పై ప్ర‌తిఫ‌లించింద‌ని ధీమాగా ఉన్న‌ట్టు కామెరూన్ చెప్పారు.  అవ‌తార్ 1, అవ‌తార్ 2 ని మించి ఈ మూడో భాగం వ‌సూలు చేయాల్సి ఉంద‌ని, ఆర్థికంగా రిట‌ర్నుల గురించి కామెరూన్ క్లారిటీగా మాట్లాడారు. అవ‌తార్ 1, 2 రెండూ క‌లుపుకుని 5.5 బిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలు చేసాయి. ఇప్పుడు అవ‌తార్ 3 తో అంత పెద్ద మొత్తం రాబ‌డ‌తామ‌ని న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అవ‌తార్ అభిమానులు ఉత్కంఠ‌గా వేచి చూస్తున్న ఇలాంటి స‌మ‌యంలో క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 19న అవ‌తార్ 3 విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. అయితే భార‌త‌దేశంలో ముంద‌స్తు టికెట్ బుకింగులు మంద‌కొడిగా ఉన్నాయి. అయినా సినిమా రిలీజ్ తేదీ స‌మీపించే కొద్దీ ఆన్ లైన్ బుకింగుల విండో కిట‌కిటలాడ‌టం ఖాయంగా క‌నిపిస్తోంది.

 

అవ‌తార్ 3 భార‌త‌దేశం నుంచి 500 కోట్లు సునాయాసంగా కొల్ల‌గొట్ట‌డం ఖాయ‌మ‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇటీవ‌ల చావా, స‌య్యారా, కాంతార 2 చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద 500కోట్లు అంత‌కుమించి వ‌సూలు చేయ‌గలిగాయి. ఆ త‌ర్వాత అవ‌తార్ 3 చిత్రానికి మాత్ర‌మే ఈ అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు. అవ‌తార్ 3 ఫెయిలైతే తాను అవ‌తార్ ఫ్రాంఛైజీనే ష‌ట్ డౌన్ చేసేస్తాన‌ని, అవ‌తార్ 4, అవ‌తార్ 5 చిత్రాల‌ను తెర‌కెక్కించ‌న‌ని కామెరూన్ స‌వాల్ విసిరారు. ఆయ‌న ఆన్ లైన్ ట్రోలింగును అస్స‌లు ఖాత‌రు చేయ‌డం లేదు. దీన‌ర్థం అవ‌తార్ 3 విజ‌యంపై ఆయ‌న ధీమాగా ఉన్నారనే కాదా!

Read Entire Article