ARTICLE AD
నిన్న శుక్రవారం విడుదల కావాల్సిన నందమూరి బాలకృష్ణ-బోయపాటి ల అఖండ తాండవం వాయిదా పడింది. ఒక పెద్ద హీరో, సక్సెస్ ఫుల్ హీరో, క్రేజీ కాంబో వాయిదా పడడం ఆ హీరో అభిమానులకు తలకొట్టేసినట్లయ్యింది. ఫైనాన్షియల్ ప్రోబ్లెంస్ సినిమా వాయిదా పడడం పరువు పోయినట్లుగా నందమూరి అభిమానులు ఫీలైపోయారు.
డిసెంబర్ 5 డేట్ నుంచి అఖండ 2 తప్పుకోవడం మళ్లీ సమస్యలన్నీ సాల్వ్ అయ్యి అఖండ 2 తాండవం మళ్లీ ఏ డేట్ ఫిక్స్ చేసుకుంటుందో అనే క్యూరియాసిటీతో అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే డిసెంబర్ 12 కానీ లేదంటే డిసెంబర్ 25 న కానీ అఖండ 2 తాండవం రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తే ఎలా ఉంటుంది అని మేకర్స్ ఆలోచన చేస్తున్నారట.
మరి నందమూరి బాలకృష్ణ డిసెంబర్ 12 న కానీ లేదంటే డిసెంబర్ 25 న ఏ డేట్ ను ఓకే చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారగా.. ఆ తేదీల్లో రాబోతున్న చిత్రాలు అఖండ 2 రిలీజ్ తో మరో తేదీ కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఎదురైంది.

1 hour ago
1