<p>అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో రెండో విడత ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని ప్రాంతంలోని ఏడు గ్రామాలలో ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 16,666 ఎకరాలకు ల్యాండ్ పూలింగ్ కోసం నోటిఫికేషన్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో అమరావతి మండలంలోని ఐదు గ్రామాలు ఉన్నాయి. </p>
<p>అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెద్ద మద్దూరు, ఏండ్రాయి, కర్లపూడి, లెమల్లె గ్రామాల్లో 7,465 ఎకరాలకు ల్యాండ్ పూలింగ్ చేయనున్నారు. అదే విధంగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని వడ్లమాను, హారిచంద్రపురం, పెద్ద పరిమి అనే మూడు గ్రామాలలో 9,097 ఎకరాలకు ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ విడుదల చేశారు.<br /><br /></p>