2025 TVS Raider 125 Price, Mileage And Features Telugu: TVS, తన పాపులర్‌ టూవీలర్‌ Raider 125 బైక్‌ను ఇప్పుడు మరింత అప్‌గ్రేడ్‌ చేసి మార్కెట్లోకి తెచ్చింది. తాజాగా లాంచ్‌ చేసిన డ్యూయల్‌ డిస్క్‌ వేరియంట్‌ (New Raider 125 dual-disc variant launch)‍‌ ప్రస్తుతం ఉన్న రైడర్‌ సిరీస్‌లో అత్యంత అడ్వాన్స్‌డ్‌ మోడల్‌గా నిలిచింది. వేరియంట్‌ ఆధారంగా దీని ధర రూ. 93,800 నుంచి రూ. 95,600 (ఎక్స్‌-షోరూమ్‌) వరకు ఉంది,

కొత్త ఫీచర్లు, అప్‌డేట్స్‌
New Raider 125 లో ముందు & వెనుక రెండు చక్రాలకు డిస్క్‌ బ్రేక్‌లు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాదు, సింగిల్‌ ఛానెల్‌ ABS సిస్టమ్‌ కూడా ఇచ్చారు, ఇది వేగంలోనూ రైడింగ్‌ సేఫ్టీని మరింత పెంచుతుంది. ఫ్రంట్‌ టైర్‌ 90/90-17, రియర్‌ టైర్‌ 110/80-17 సైజులో కొత్త కాన్ఫిగరేషన్‌తో వచ్చింది, ఇది రోడ్‌ గ్రిప్‌ను మరింత మెరుగుపరుస్తుంది.

బూస్ట్‌ మోడ్‌ - కొత్త ఎక్స్‌పీరియన్స్‌
TVS Jupiter లాగా TVS Raider 125 లో కూడా ఇప్పుడు బూస్ట్‌ మోడ్‌ అందించారు. ఈ ఫీచర్‌ వల్ల, ఏదైనా వెహికల్‌ను వేగంగా ఓవర్‌టేక్‌ చేయడానికి అవసరమైన అదనపు టార్క్‌ రైడర్‌కు లభిస్తుంది. నగరాల్లో ట్రాఫిక్‌లో సులభంగా నడిపేందుకు GTT (Glide Through Technology) కూడా అందుబాటులో ఉంది. దీని వల్ల తక్కువ స్పీడ్‌లో కూడా బైక్‌ స్థిరంగా సాగుతుంది, ఇంధన సామర్థ్యం పెరుగుతుంది, తద్వారా డబ్బు ఆదా అవుతుంది.

డిస్‌ప్లే ఆప్షన్స్‌ – LCD & TFT

కొత్త TVS Raider 125 వేరియంట్‌లో రెండు స్క్రీన్‌ ఆప్షన్లు ఉన్నాయి.

SXC DD వేరియంట్‌ - LCD స్క్రీన్‌తో రూ. 93,800

TFT DD వేరియంట్‌ - TFT డిస్‌ప్లేతో రూ. 95,600

TFT స్క్రీన్‌లో డిజిటల్‌ స్పీడోమీటర్‌, కాల్‌/SMS అలర్ట్స్‌, రియల్‌ టైమ్‌ మైలేజ్‌ లాంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ సెగ్మెంట్‌లో, ఇన్ని మోడ్రన్‌ టెక్‌ ఫీచర్లతో వచ్చిన అతి కొన్ని బైక్‌లలో Raider ఒకటి.

కలర్‌ ఆప్షన్‌
ఈ కొత్త వేరియంట్‌లో ఆకర్షణీయమైన రెడ్‌ కలర్‌ స్కీమ్‌ అందించారు. ఇది Raider డిజైన్‌కి స్పోర్టీ లుక్‌ ఇస్తుంది.

2025 TVS Raider 125 కొత్త వేరియంట్‌ ఇప్పుడు యువ రైడర్లను బాగా ఆకట్టుకునేలా రూపొందించారు. డ్యూయల్‌ డిస్క్‌లు, ABS, బూస్ట్‌ మోడ్‌, TFT స్క్రీన్‌ - ఇవన్నీ Raider ని కేవలం కమ్యూటర్‌ బైక్‌గా కాకుండా ఒక స్టైలిష్‌ & పవర్‌ఫుల్‌ ఆప్షన్‌గా నిలబెట్టాయి. ఈ ధర పరిధిలో, ఇది ఒక “బెస్ట్‌ ప్యాకేజ్‌” అని చెప్పవచ్చు.