అఖండ 2 కి పవన్ కళ్యాణ్ అడ్డంకి

1 day ago 1
ARTICLE AD

తెలంగాణాలో అఖండ 2 విడుదల ముందు ఎంత సమస్య అయ్యిందో చూస్తున్నాం. ప్రీమియర్ షోస్ కి అనుమతులు, టికెట్ రేట్లు పెంపుకు అనుమతులు సినిమా విడుదలకు కొన్ని గంటల ముందే జరగడం, టికెట్ బుకింగ్స్ ఓపెన్ కాకపోవడం ఇలా చాలా గందరగోళమే నడిచింది. ఫైనల్ గా ఈ రోజు గురువారం సాయంత్రం రాత్రి 8 గంటలకు ప్రీమియర్స్ కి అలాగే దానికి 600 టికెట్ రేట్ నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం సింగిల్ స్క్రీన్‌లకు రూ.50, మల్టీప్లెక్స్‌లకు రూ.100 హైక్ (GST సహా) పెంచుకునే వెసులుబాటు కల్పించింది. 

అంతేకాకుండా సినిమా ద్వారా వచ్చిన అదనపు ఆదాయంలో 20%ను మూవీ ఆర్టిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌కి తప్పనిసరి అంటూ జీవో జారీ చేసింది. మరోపక్క తెలంగాణాలో ఈరోజు నైట్ 8 గంటలకు పడాల్సిన ప్రీమియర్ షో క్యాన్సిల్ అయ్యింది. ఒక పెద్ద హీరో, భారీ బడ్జెట్ మూవీ విడుదలకు ముందు తెలంగాణాలో ఇంత రచ్చ జరగడం ఇదే మొదటిసారి. అయితే దీని వెనుక పవన్ కళ్యాణ్ సమస్య ఉందనే టాక్ కూడా వినబడుతుంది. 

ఆయన రీసెంట్ గా గోదావరి జిల్లాల పచ్చదనం వల్లే ఆంధ్రప్రదేశ్‌ విడిపోయిందని.. కోనసీమ కొబ్బరి చెట్లతో పచ్చగా కళకళలాడుతూ ఉంటుందని తెలంగాణ నేతలు అనేవారని, నరుడి దిష్టికి నల్ల రాయి అయినా బద్దలైపోతుందని, కోనసీమ కొబ్బరి చెట్లకు కూడా అదే జరిగి ఉంటుందని పవన్ చేసిన కామెంట్స్ పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. 

తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అయితే పవన్ కళ్యాణ్ సినిమాలు తెలంగాణాలో ఆడనివ్వమని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. పవన్ క్షమాపణలు చెప్పకపోతే పవన్ సినిమాలు ఆడనివ్వమన్న కోమటి రెడ్డి, పవన్ సన్నిహితుడు బాలయ్య సినిమాపై ఇలా కక్ష తీర్చుకున్నారా, అందుకే ప్రీమియర్స్ కి టికెట్ రేట్లు అధికంగా పెంచుకోవడానికి అనుమతులు ఆలస్యంగా ఇవ్వడం, సినిమా ద్వారా వచ్చిన అదనపు ఆదాయంలో 20%ను మూవీ ఆర్టిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌కి తప్పనిసరి, ఆ మొత్తాన్ని FDC పర్యవేక్షణలో ప్రత్యేక ఖాతాకు జమ చేయాలి అనే మెలిక పెట్టారా అంటూ కొంతమంది చర్చించుకోవడం హైలెట్ అయ్యింది. మరి పవన్ సమస్య వల్లే అఖండ 2 కి ఇలా జరిగిందా అనే అనుమానాలు మొదలయ్యాయి. 

Read Entire Article