Actress Zayn Marie Khan Trending After Dacoit Trailer Launch Event : జైన్ మేరీ ఖాన్... అడివి శేష్ డెకాయిట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తర్వాత ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న పేరు. ఈవెంట్‌లో బ్యూటిఫుల్ లుక్‌లో మెరిసిన ఈ బ్యూటీ ఎవరా? అంటూ నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తూ... ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

అసలెవరీ జైన్ మేరీ ఖాన్?

జైన్ మేరీ ఖాన్ (31) ... బాలీవుడ్ దర్శక నిర్మాత మన్సూర్ ఖాన్ కుమార్తె. బాలీవుడ్ లెజెండ్ అమీర్ ఖాన్‌కు మేనకోడలు. బాలీవుడ్ నటులు ఇమ్రాన్ ఖాన్, జునైద్ ఖాన్‌ ఈమెకు కజిన్స్. ఇప్పటికే పలు బాలీవుడ్ సినిమాల్లో నటించిన జైన్... డెకాయిట్‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. కపూర్ అండ్ సన్స్ (2016), సీక్రెట్ సూపర్ స్టార్ (2017) వంటి చిత్రాలకు జైన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు. ఆ తర్వాత యాక్టింగ్‌పై ఇంట్రెస్ట్‌తో ఆ దిశగా అడుగులు వేశారు.

ఇంటర్నేషనల్ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ 2020లో నిర్మించిన 'మిసెస్ సీరియల్ కిల్లర్' మూవీతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత మోనికా ఓ మై డార్లింగ్ (2020) మూవీలోనూ నటించి మెప్పించారు. ఫీల్స్ లైక్ ఇష్క్, ఆర్యన్ అండ్ మీరా, మేడ్ ఇన్ హెవెన్ అనే వెబ్ సిరీస్‌ల్లో నటించారు. ఆకాష్ మొహిమన్‌ను 2021లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం తెలుగులో డెకాయిట్ మూవీలో కీలక పాత్ర పోషించారు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు.

Also Read : గ్రామంలో చిన్నారుల హత్యలు - బంగ్లాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటనలు... ట్రెండింగ్‌లో హారర్ థ్రిల్లర్ 'గ్రానీ'