<p>అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటి వద్ద మంటల ఘటనపై తాడేపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా వైసీపీ ఆఫీసుకు నోటీసులు జారీ చేశారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగింది, ఘటనపై పూర్తి వివరాల కోసం సీసీ ఫుటేజ్ ఇవ్వాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. జగన్ ఇంటి సమీపంలో మంటలలో మర్మమేంటో తేల్చే పనిలో తాడేపల్లి పోలీసులు విచారణ చేపట్టారు.</p>