Yezdi Roadster and Royal Enfield Bullet 350: మీరు స్టైలిష్‌గా,నడపడానికి సరదాగా ఉండే బైక్ కోసం చూస్తున్నట్లయితే, Yezdi Roadster, Royal Enfield Bullet 350 రెండూ మంచి ఆప్షన్‌లే. Yezdi Roadster మరింత ఆధునిక, స్పోర్టీ లుక్‌ను కలిగి ఉంది, అయితే Bullet 350 దాని క్లాసిక్ డిజైన్, చాలా కాలంగా నమ్మదగిన పనితీరుతో దూసుకెళ్తోంది. ఇప్పుడు, 2025లో మీకు ఏ బైక్ మంచిదో అనే ప్రశ్నకు ఇక్కడ వివరంగా సమాధానం తెలుసుకుందాం.

ధర వ్యత్యాసం

ధర విషయానికి వస్తే, Royal Enfield Bullet 350 మరింత చవకైన బైక్. మీ బడ్జెట్ పరిమితంగా ఉండి, మీరు నమ్మదగిన రెట్రో బైక్ కావాలనుకుంటే, Bullet 350 మంచి ఎంపిక అవుతుంది. Yezdi Roadster ధర కొంచెం ఎక్కువ, ఎందుకంటే ఇందులో ఫీచర్లు మరింత ఆధునికమైనవి, ప్రీమియం. కాబట్టి మీరు కొంచెం ఎక్కువ ధర పెట్టి మంచి ఫీచర్లతో కూడిన బైక్ తీసుకోవాలనుకుంటే, Roadster సరైనది.

ఇంజిన్ -పనితీరు

పనితీరు గురించి మాట్లాడితే, Yezdi Roadster ముందంజలో ఉంటుంది. దీని లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ స్మూత్‌, ఎక్కువ వపర్‌ని ఇస్తుంది. ఈ బైక్ నగరంలో నడపడానికి, హైవేపై వేగంగా నడపడానికి కూడా చాలా బాగుంటుంది. Royal Enfield Bullet 350 ఇంజిన్ పవర్‌లో వీక్‌గా ఉంటుంది. కానీ దాని టార్క్ బాగుంది, ఇది నగరంలో నడిపేటప్పుడు మంచి నియంత్రణ కలిగి ఉంటుంది. Bullet ఇంజిన్ నడపడానికి ప్రశాంతంగా, క్లాసిక్ అనుభూతిని ఇస్తుంది, అయితే Roadster మరింత స్పోర్టీగా ఉంటుంది. మీరు వేగం, కొంచెం ఉత్సాహం కోరుకుంటే, Yezdi Roadster మంచిది. కానీ మీరు సౌకర్యం, క్లాసిక్ రైడ్ కావాలనుకుంటే, Bullet 350 సరైనది.

ఎవరి ఇంధన వ్యయం తక్కువ?

Royal Enfield Bullet 350 మైలేజ్ Yezdi Roadster కంటే మెరుగైనదిగా చెప్పుకోవచ్చు. దీని ఎయిర్-కూల్డ్ ఇంజిన్ తక్కువ పెట్రోల్ వినియోగిస్తుంది, ఇది రోజూ ఆఫీసుకు వెళ్లే వారికి ఉపయోగపడుతుంది. Yezdi Roadster మైలేజ్ తక్కువగా ఉంటుంది. ఇది దాదాపు 25–28 kmpl ఇవ్వవచ్చు. అయితే దీని 6-స్పీడ్ గేర్‌బాక్స్ హైవేపై రైడ్‌ను చాలా సులభం చేస్తుంది. మీరు ఎక్కువ మైలేజ్ కోరుకుంటే, Bullet 350 మంచిది.

ఫీచర్లు -ప్రత్యేకతలు

Yezdi Roadster -Bullet 350 రెండింటిలోనూ ముందు డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. కానీ Roadster డ్యూయల్-ఛానల్ ABSని కలిగి ఉంది, ఇది బ్రేకింగ్‌ను మరింత సురక్షితంగా చేస్తుంది. Bullet 350 సింగిల్-ఛానల్ ABSని కలిగి ఉంది.

ఏ బైక్ కొనడం మంచి నిర్ణయం అవుతుంది?

రెండింటిలో ఏ బైక్ కూడా పూర్తిగా మంచిదని కానీ లేదా పూర్తిగా ప్రతికూలమైందని కానీ చెప్పలేం. ఇది పూర్తిగా మీ అవసరం, ఇష్టానికి సంబంధించినది. మీరు ఎక్కువ పవర్‌, ఆధునిక ఫీచర్లు, స్పోర్టీ రైడ్ కోరుకుంటే Yezdi Roadster మీకు మంచి ఆప్షన్ అవుతుంది. మీరు తక్కువ ధర, మంచి మైలేజ్, క్లాసిక్ రాయల్ అనుభూతిని కోరుకుంటే, Royal Enfield Bullet 350 మీకు సరైనదిగా భావించవచ్చు.