Senior Actor To Play Key Role In Devi Sriprasad Yellamma Movie : మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా 'బలగం' ఫేం వేణు ఎల్దండి దర్శకత్వంలో క్రేజీ ప్రాజెక్ట్ 'ఎల్లమ్మ' సంక్రాంతికి అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తనదైన శైలిలోనే గ్రామదేవత 'ఎల్లమ్మ' ప్రధానాంశంగా గ్రామీణ బ్యాక్ డ్రాప్ స్టోరీని తెరకెక్కించేందుకు వేణు రెడీ అవుతున్నట్లు గ్లింప్స్‌ను బట్టి తెలుస్తోంది.

సీనియర్ హీరో?

ఈ మూవీలో సీనియర్ హీరో రాజశేఖర్ నటిస్తారనే ప్రచారం సాగుతోంది. ఆయనది హీరో దేవిశ్రీ తండ్రి పాత్ర అనే టాక్ వినిపిస్తోంది. దీనిపై మూవీ టీం అధికారికంగా రియాక్ట్ కావాల్సి ఉంది. ఇప్పటికే దేవిశ్రీ లుక్ అదిరిపోయింది. ఈ మూవీలో 'పర్శి' అనే పాత్రలో దేవిశ్రీ నటిస్తుండగా... మ్యూజిక్ సైతం ఆయనే అందిస్తున్నారు. గ్లింప్స్ బీజీఎం లిరిక్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. జానపద సంస్కృతి, దైవిక శక్తి, గ్రామీణ నేపథ్యం హైలెట్‌గా మూవీ తెరకెక్కనుంది. భారీ వర్షం... మహా వృక్షం కింద ఓ చిరు దీపం... ఆ వెనుక ఖడ్గం... చినుకుల్లో ఉరుముల మధ్య చేతిలో డప్పుతో హీరో లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.

Also Read : 'మన శంకర వరప్రసాద్ గారు' కుమ్మేశారు - 300 కోట్ల క్లబ్‌లోకి మెగాస్టార్ సంక్రాంతి మూవీ... ఫస్ట్ వీక్ కలెక్షన్స్