<p>YSRCP opposing Capital Bill: వైఎస్ఆర్ <a title="కాంగ్రెస్" href="https://telugu.abplive.com/topic/Congress" data-type="interlinkingkeywords">కాంగ్రెస్</a> పార్టీ అమరావతి బిల్లును లోక్ సభలో వ్యతిరేకించింది. అమరావతికి వ్యతిరేకం కాదని తాము చర్చలో పాల్గొంటామని మిథున్ రెడ్డి సమావేశం ప్రారంభానికి ముందు మీడియా ప్రతినిధులతో చెప్పారు. అయితే సభలో చర్చ ప్రారంభమయ్యే సరికి పూర్తిగా వ్యూహం మారిపోయింది. తాడేపల్లిలో <a title="జగన్" href="https://telugu.abplive.com/topic/cm-jagan" data-type="interlinkingkeywords">జగన్</a> మోహన్ రెడ్డి ప్రెస్మీట్ చూసిన తర్వాత మిథున్ రెడ్డి తన వ్యూహం మార్చుకున్నారేమో కానీ.. ప్రస్తుత రూపంలో తాము బిల్లును వ్యతిరేకిస్తున్నామని చెప్పి వాకౌట్ చేస్తున్నట్లుగా ప్రకటించి . .. మిగిలిన ముగ్గురు ఎంపీలతో కలిసి బయటకు వెళ్లిపోయారు. </p>