Women Wallet Tips In Telugu: వాస్తు,జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని శుభప్రదమైన వస్తువులను మహిళలు తమ పర్సులు లేదా హ్యాండ్ బ్యాగ్స్ లో ఉంచుకోవడం వల్ల శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులు మీపై ఉంటాయని చెబుతున్నారు పండితులు. వెండినాణేలు, గోమతిచక్రం సహా ఇతర సులభమైన పరిహారాల గురించి ఇక్కడ తెలుసుకోండి.

మహిళల పర్సులు కేవలం డబ్బు దాచుకునే చోటు మాత్రమే కాదు.. సంపద పెరుగుదలకు, శ్రేయస్సు, సంతోషానికి చిహ్నం అని చెబుతారు ఆధ్యాత్మికవేత్తలు. పర్సులో శుభప్రదమైన వస్తువులు ఉంచడంతో పాటూ ఎప్పటికప్పుడు పనికిరాని పేపర్లు తొలగించి, నోట్లను ఓ క్రమపద్ధతిలో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని నమ్మకం. మీరు తప్పనిసరిగా అనుసరించాల్సిన కొన్ని పరిహారాలు ఇక్కడున్నాయి.

ప్రతికూల శక్తి , వాస్తు దోషాలకు లవంగంతో ప్రభావంతమైన 5 సులువైన చిట్కాలు!

ఎర్రటి కాగితంపై మీ కోరికను రాయండి

మీ కోరికను, ఎప్పటినుంచో పెండింగ్ లో ఉండిపోయిన పనిని చిన్న ఎర్రటి కాగితంపై రాసి పర్సులో ఉంచుకుంటే శుభం జరుగుతుందట. పెండింగ్ లో ఉన్న ఆ పని పూర్తవుతుందని, సానుకూల శక్తితో మీ కోర్కెను నెరవేరుస్తుందని నమ్మకం. ఈ పరిహారం ఆర్థిక లాభం , విజయం కోసం కొత్త మార్గాలను తెరవడానికి కూడా సహాయపడుతుంది.

లక్ష్మీదేవి వెండి నాణెం

మీ పర్సులో లక్ష్మీదేవి ఫొటో ఉన్న వెండి నాణెం ఉంచుకోవడం చాలా శుభప్రదంగా భావిస్తారు. అలాగే, లక్ష్మీదేవికి సమర్పించిన 21 బియ్యపు గింజల చిన్న ప్యాకెట్‌ను ఉంచుకోవడం శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు. ఈ ఆచారం ఆర్థిక స్థిరత్వానికి , సంపద వృద్ధికి చిహ్నంగా పరిగణిస్తారు.

గంగాజలంలో శుద్ధి చేసిన రావి ఆకు

శనివారం రోజున గంగాజలంతో శుద్ధి చేసిన రావి ఆకును మీ పర్సులో ఉంచుకోవడం శుభప్రదంగా భావిస్తారు. ఇది ప్రతికూల శక్తిని తొలగించి, ఆర్థిక అడ్డంకులను తగ్గిస్తుంది.

గోమతి చక్రం

గోమతి చక్రాన్ని పర్సులో పెట్టుకుంటే ఆనందం, శ్రేయస్సు మీ సొంతం అవుతుంది.

పనికిరాని వస్తువులు తీసేయండి

మీ పర్సులో పాత నోట్లు, చిరిగిన కాగితాలు , పనికిరాని వస్తువులను ఉంచుకోవడం ప్రతికూలతను పెంచుతుంది, సంపద నిలవకుండా చేస్తుంది. అంతేకాకుండా, మురికి చేతులతో పర్సును తాకడం , నోట్లను చిందరవందరగా ఉంచడం మానుకోవాలి. శుభ్రత ఉండే దగ్గరే అమ్మవారు కొలువై ఉంటుంది

ముల్తానీ మట్టి కేవలం చర్మ సంరక్షణకే కాదు..వాస్తుదోష నివారణకు కూడా!

సానుకూల ఆలోచనలు

సంపద వృద్ధి చెందాలంటే కేవలం పాటించే చర్యలు, పరిహారాలు మాత్రమే కాదు... సానుకూల ఆలోచనలు, డబ్బు పట్ల గౌరవం ఉండడం కూడా ప్రధానం. క్రమశిక్షణ, మంచి అలవాట్లు కూడా ఆనందాన్నిస్తాయి, కెరీర్లో ఉన్నతిని సూచిస్తాయి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

బంగారం దాచుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తే నష్టమే! వాస్తు ప్రకారం సరైన దిశ, జాగ్రత్తలు తెలుసుకోండి