భారత్, దక్షిణాఫ్రికా సూపర్-8 మ్యాచ్‌లో డెవాల్డ్ బ్రెవిస్ ఆడిన షాట్ హాట్ టాపిక్ అవుతోంది. డెవాల్డ్ బ్రేవిస్ నో లుక్ షాట్ ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. సఫారీ బ్యాటర్ షాట్ ఆడిన బాల్ 82 మీటర్ల దూరంలో ఉన్న బౌండరీ అవతల పడింది. ఈ 'నో-లుక్ షాట్' (No-look shot) ఎందుకు అంత ప్రత్యేకమంటే, టీ20ల్లో ప్రపంచ నంబర్-1 బౌలర్ అయిన వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో బ్రెవిస్ ఈ ఘనత సాధించాడు. సూపర్-8 మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. కానీ భారత్ ఘోరంగా విఫలమైంది. 18.5 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌట్ అయింది.

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 9వ ఓవర్లో డెవాల్డ్ బ్రేవిస్ నో లుక్ షాట్ ఆడాడు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన స్పెల్‌లో రెండో ఓవర్ వేశాడు. ఓవర్ మొదటి 4 బంతుల్లోనే 11 పరుగులు వచ్చాయి. ఐదో బంతికి డెవాల్డ్ బ్రెవిస్ బంతిని స్ట్రైట్ గా కొట్టాడు. అసలు ఆ బంతి బౌండరీ దాటుతుందో లేదో అని సరిగ్గా చూడలేదు. వరుణ్ చక్రవర్తి వేసిన ఈ ఓవర్లో మొత్తం 17 పరుగులు ఇచ్చాడు.

Throwback when CSK blood Dewald Brevis cooked 🔥 world's number one bowler Varun with his no look shot 💉 🔥pic.twitter.com/6j7mt11JC2

— Troll Ms Haters (@msdforlife07) February 22, 2026

నో-లుక్ షాట్ అంటే ఏమిటి?

నో-లుక్ షాట్ అనేది బ్యాటర్ కాన్ఫిడెన్స్ తెలియజేస్తుంది. బ్యాటర్ బంతిని బ్యాట్ మధ్యభాగంలో కనెక్ట్ అయిన తర్వాత, బాల్ ఎటు వెళ్తుందో చూడకుండా ఉండటాన్ని నో లుక్ షాట్ అంటారు. తరువాత బ్యాటర్ తీరిగ్గా అటువైపు చూస్తాడు. డెవాల్డ్ బ్రెవిస్ కూడా అదే చేశాడు. అతడి బ్యాట్ తగలగానే బంతి బుల్లెట్ వేగంతో నేరుగా వెళ్లి బౌండరీ లైన్ అవతల పడింది. షాట్ కొట్టిన తర్వాత బ్రెవిస్ తల కిందకు వంచాడు. ఆ బంతి ఖచ్చితంగా సిక్సర్ వెళ్తుందని అతడు నమ్మాడు.

ఈ షాట్ ఎవరు ప్రారంభించారు?

ఇటీవల నో-లుక్ షాట్ పలు సందర్భాల్లో కనిపిస్తుంది. అదే తీరుగా వైరల్ అవుతోంది. మొన్న హర్దిక్ పాండ్యా సైతం నో లుక్ షాక్ కొట్టి సోషల్ మీడియాను షేక్ చేశాడు. నో లుక్ షాట్ గురించి టాపిక్ వస్తే పలువురు బ్యాటర్ల పేర్లు వినిపిస్తాయి. వెస్టిండీస్ ఆటగాడు ఆండ్రీ ఫ్లెచర్ అంతర్జాతీయ, లీగ్ క్రికెట్‌లో తరచుగా ఈ షాట్ ఆడుతూ కనిపించాడు. అయితే, 2009లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ నో-లుక్ షాట్ ఆడిన వీడియో ఓ రేంజ్‌లో వైరల్ అయింది. అఫ్గానిస్థాన్‌కు చెందిన రషీద్ ఖాన్‌తో పాటు పాకిస్థాన్‌కు చెందిన సైమ్ అయూబ్ కూడా నో-లుక్ షాట్‌కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చారు.