Woman Loses 72 Kg in 3 Years : బరువు తగ్గించుకోవాలని ప్రయత్నించిన ఓ పోషకాహార నిపుణురాలు అద్భుతమైన రిజల్ట్స్ పొందింది. కేవలం 7 సులభమైన మార్పులు, జీవనశైలి చిట్కాలను అనుసరించి.. 3 సంవత్సరాలలో 72 కిలోలకు పైగా బరువు తగ్గింది. ఇంతకీ ఆమె ఎవరు? ఎలాంటి మార్పులు, చేర్పులతో బరువు తగ్గిందో.. బరువు తగ్గాలనుకునేవారు వాటిని ఫాలో అవ్వొచ్చో లేదో తెలుసుకుందాం.

ఈ రోజుల్లో బరువు పెరగడం అనేది కేవలం కంటికి కనిపించే సమస్య మాత్రమే కాదు.. అనేక ఆరోగ్య సమస్యలకు మూల కారణం అవుతుంది. అందుకే చాలామంది బరువు తగ్గాలని కోరుకుంటున్నారు. కానీ ఈ ప్రాసెస్ ఎలా ప్రారంభించాలి? ఏమి తినాలి? ఎంత వ్యాయామం చేయాలి? వంటి ప్రశ్నలు వారిని ఇబ్బందులకు గురి చేస్తాయి. పైగా స్టార్ట్ చేసి వాటిని మధ్యలో ఆపేస్తారు. కానీ కఠినమైనవి కాకుండా.. సింపుల్గా లైఫ్ స్టైల్ మార్పులు చేసి బరువును అదుపులోకి తెచ్చుకుంది ఓ మహిళ.

బరువు తగ్గాలనుకునేవారికి.. ఫిట్‌నెస్, పోషకాహార కోచ్ ఎమ్మా హుకర్ స్టోరి స్ఫూర్తిదాయకంగా ఉంది. ఎందుకంటే ఆమె మూడు సంవత్సరాలలో దాదాపు 72 కిలోల బరువు తగ్గింది. దీనికోసం ఆమె ఎలాంటి ఫాస్ట్ డైట్, ఫాస్ట్ ఫలితాలు ఇచ్చే మార్గాలు ఎంచుకోలేదు. కేవలం లైఫ్స్టైల్లో కొన్ని సింపుల్, స్థిరమైన మార్పులు చేసి బరువు తగ్గింది. సురక్షితంగా, శాశ్వతంగా బరువు తగ్గడానికి చేసిన 7 మార్పులు ఏంటో చూసేద్దాం.

చిన్న అలవాట్లతో..

చాలామంది చేసే తప్పు ఏంటంటే.. ముందే మేజర్గా మార్పులు చేసి.. త్వరగా వాటిని వదిలేస్తారు. జిమ్‌ ఎక్కువసేపు చేయడం, సలాడ్‌లు తినడం లాంటివి వీటిలోకే వస్తాయి. దీంతో కొన్ని రోజుల్లోనే ఫిట్‌గా ఉంటారు. కానీ ఎక్కువ కాలం కొనసాగించలేరు. బదులుగా ప్రతిరోజూ తగినంత నీరు త్రాగడం, 15–20 నిమిషాలు నడవడం, షుగర్ కంట్రోల్ చేసుకోవడం, రోజూ ఒకే సమయానికి పడుకోవడం వంటి చిన్న మార్పులతో స్టార్ట్ చేస్తే ఇవి ఎక్కువకాలం కొనసాగి.. మంచి ఫలితాలు ఇస్తాయి.

పోషకాలు ఉండాల్సిందే..

తక్కువ తినడం లేదా సలాడ్లు మాత్రమే తినడం బరువు తగ్గడానికి సరైన మార్గం కాదు. ఎందుకంటే శరీరానికి తగినంత పోషకాహారం అందించకుంటే అది జీవక్రియను మందగించేలా చేస్తుంది. ప్రతి భోజనంలో ప్రోటీన్‌ను చేర్చండి. కాయధాన్యాలు, కాటేజ్ చీజ్, గుడ్లు, చికెన్ మొదలైనవి. కూరగాయలు, పండ్లు, నట్స్ వంటివి ఉండేలా చూసుకోండి. సమతుల్య ఆహారం మాత్రమే దీర్ఘకాలికంగా బరువు తగ్గడానికి మీకు సహాయపడుతుంది.

పార్టనర్ ఉంటే మరీ మంచిది..

బరువు తగ్గాలనే జర్నీలో మీ ఫ్రెండ్ లేదా మీ పార్టనర్తో ప్రారంభించండి. ఇది మీకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. మీరిద్దరూ ఒకరికొకరు టిప్స్ ఇచ్చుకోవచ్చు. స్నేహితుడితో కలిసి వ్యాయామం చేయడం ప్రారంభించవచ్చు, ఫిట్‌నెస్ గ్రూప్‌లో చేరవచ్చు. ఇది మీరు బరువు తగ్గాలనే కోరికకు దగ్గరగా ఉంచుతుంది.

రెస్ట్ కూడా ముఖ్యమే..

చాలా మంది ఒక రోజు వ్యాయామం చేయకపోతే అంతా వృధా అని అనుకుంటారు. కానీ విశ్రాంతి చాలా ముఖ్యం. కాబట్టి తగినంత నద్ర ఉండేలా చూసుకోండి. అవసరమైతే ఒక చిన్న నాప్ తీసుకోండి. వారానికి ఒక రోజు విశ్రాంతి తీసుకోండి. ఇది మీ శరీరం కోలుకోవడానికి సహాయపడుతుంది.

తేలికపాటి వ్యాయామం

రోజుకు రెండు గంటలు జిమ్‌కు వెళ్లే బదులు.. వారానికి 4–5 రోజులు 20–30 నిమిషాలు ఏదొక యాక్టివిటీ చేయడం మంచిది. మీ వ్యాయామం కోసం ఒక సమయాన్ని సెట్ చేసుకోండి. తక్కువ సమయం ఉన్నప్పటికీ.. 10 నిమిషాలు దానిని కచ్చితంగా చేయండి. మీకు ఇష్టం లేకపోయినా తేలికపాటి కార్యాచరణలో పాల్గొనండి.

కొలతలతో పని కాదు..

మీరు బరువు తగ్గితేనే సక్సెస్ అయినట్లు కాదు. దానిని మీరు ఎంతవరకు రెగ్యులర్గా ఫాలో అవుతున్నారనేదే మ్యాటర్. ఎందుకుంటే బరువు తగ్గడం అనేది కొన్నిసార్లు నెమ్మదిగా జరుగుతుంది. కానీ మీ శరీరంలో సానుకూల మార్పులు వస్తాయి. కానీ కొందరు తగ్గట్లే అనే నిరాశతో మానేస్తారు. అది కరెక్ట్ కాదు. రెగ్యులర్గా చేయడమే ఇంపార్టెంట్.

నచ్చింది చేయండి..

మీకు పరుగెత్తడం ఇష్టం లేకపోతే.. మిమ్మల్ని మీరు బలవంతం చేయకండి. కాబట్టి మీరు డ్యాన్స్ చేయవచ్చు. ఈత కొట్టవచ్చు. యోగా చేయవచ్చు లేదా సైక్లింగ్ చేయవచ్చు. ఇలా మీకు నచ్చే కార్యాచరణను ఎంచుకోండి. ఇలాంటివి చేసేప్పుడు ఈజీగా చేయగలుగుతారు.

వీటిని రెగ్యులర్గా ఫాలో అయితే కచ్చితంగా బరువు తగ్గుతారని చెప్తున్నారు. ఇవి ఎలాంటివారికి ఇబ్బందువు కలిగించవు కాబట్టి.. నిపుణుల సలహాతో మీరు కూడా ఫాలో అవ్వండి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.