Personalized Diet Plan with ChatGPT : నేటి దైనందిన జీవితంలో సాంకేతికత చాలా వేగంగా స్థానం సంపాదించుకుంటోంది. ఈమెయిల్ రాయడం, ఆఫీస్ షెడ్యూల్‌, మీటింగ్స్ లేదా ఇంటి పనులు వంటివి ఏవైనా.. ప్రతిచోటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మనకు సహాయం చేస్తోంది. అలాగే ఇప్పుడు సాంకేతికత సహాయంతో ఫిట్‌నెస్, ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచుకోవచ్చు. మొదట్లో బరువు తగ్గడానికి డైట్ చార్ట్ కోసం వైద్యులు లేదా పోషకాహార నిపుణులను సంప్రదించాల్సి వచ్చేది. ఇప్పుడు అదే పనిని మీరు మీ ఫోన్‌తో కొన్ని నిమిషాల్లోనే చేయవచ్చు. అది కూడా ChatGPT సహాయంతో తెలుసుకోవచ్చని చెప్తున్నారు ఫిజియోథెరపిస్ట్, పోషకాహార నిపుణుడు డాక్టర్ రెబెకా.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేసి.. దానిలో ChatGPT సహాయంతో కొన్ని నిమిషాల్లో బరువును తగ్గించే ప్రణాళికను ఎలా తయారు చేసుకోవాలో వివరించారు. రెబెకా ప్రకారం.. మీరు మీ BMR (బేసల్ మెటబాలిక్ రేట్), TDEE (మొత్తం రోజువారీ శక్తి వ్యయం) ఇస్తే ఈజీగా మీరు డైట్ పొందవచ్చు. అంటే మీరు రోజుకు ఎన్ని కేలరీలు తీసుకుంటున్నారు.. వాటిలో ప్రోటీన్, కార్బ్స్, కొవ్వు ఎంతనేది తెలుసుకోవాలి. అప్పుడు ChatGPT మీకు పర్ఫెక్ట్ డైట్ ప్లాన్ ఇవ్వగలుగుతుంది. కాబట్టి మీరు సరైన సమాచారంతో పాటు సరైన ప్రాంప్ట్ ఇవ్వాలి.

BMR, TDEE ఎలా గుర్తించాలంటే

రెబెకా ప్రకారం.. ChatGPTకి మీ శరీరం, వయస్సు, జీవనశైలికి సంబంధించిన సమాచారాన్ని ఇస్తే అది మీ కోసం ఖచ్చితమైన కేలరీల లక్ష్యాన్ని సిద్ధం చేయగలదు. దీని కోసం మీరు ChatGPTకి ఈ ప్రాంప్ట్ ఇవ్వండి. Calculate my BMR, TDEE, ideal calorie intake, and macro targets for fat loss. I am a [age]-year-old [male/female], [height in cm] tall, weighing [weight in kg], with a [activity level: sedentary, lightly active, moderately active, or very active] lifestyle. I want to [lose fat]. ఈ ప్రాంప్ట్, సరైన డిటైల్స్ ఇస్తే.. మీకు మంచి డైట్ చార్ట్ ఇస్తుంది.

ఇండియన్ ఫుడ్తో డైట్ ప్లాన్

ChatGPT డైట్ ప్లాన్ మీ ఆహార ప్రాధాన్యతలు, మీ భోజన సమయం, మీ జీవనశైలి ప్రకారం వస్తుంది. రెబెకా ప్రకారం.. దీని కోసం మీరు రోజుకు ఎన్నిసార్లు తింటారో ChatGPTకి తెలియజేయాలి. మీకు ఏ సమయంలో ఆకలిగా ఉంటుంది? మీకు ఏ ఆహారాలు ఇష్టం, ఏవి ఇష్టం లేదు, మీరు శాఖాహారులా, మాంసాహారులా, ఎగ్‌టేరియన్‌లా లేదా మిక్స్ డైట్ తీసుకుంటారా అని తెలియజేయాలి. మీరు డైట్ ప్లాన్ భారతీయంగా ఉండాలని కోరుకుంటే.. ఈ సమాచారం ఆధారంగా ChatGPT మీకు డైట్ ప్లాన్‌ను అందిస్తుంది. దీనిని మీరు మీ దైనందిన జీవితంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అనుసరించడం ద్వారా బరువు తగ్గించుకోవచ్చు. మీకు మరిన్ని ఎంపికలు కావాలంటే, మీరు ChatGPTని వివిధ రకాల భారతీయ, ఆరోగ్యకరమైన, తక్కువ కేలరీల ఆహారాన్ని సూచించమని అడగవచ్చు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.