Water Weight : వాటర్ వెయిట్ ఎలా తగ్గించుకోవాలి? శరీరంలో నీరు పేరుకుపోవడానికి కారణాలివే

3 weeks ago 2
ARTICLE AD

బరువులో మార్పు కనిపించినప్పుడల్లా.. దానికి ఆహారపు అలవాట్లు లేదా జీవనశైలిలో మార్పులే కారణమని అనుకుంటాము. కానీ బరువు పెరగడానికి ఇతర కారణాలు కూడా ఉంటాయని అంటున్నారు నిపుణులు. కానీ వాటిని చాలామంది త్వరగా గుర్తించరని.. దీనివల్ల బరువు తగ్గడంలో ఇబ్బంది ఎదుర్కొంటారని తెలిపారు. అలాంటి వాటిలో వాటర్ వెయిట్ కూడా ఒకటి.

అసలు వాటర్ వెయిట్ అంటే ఏమిటి? దానిని ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై డాక్టర్ పూజా పిళ్లై పలు విషయాలు వివరించారు. బెంగళూరులోని ఆస్టర్ CMI హాస్పిటల్లో కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్​గా చేస్తోన్న డాక్టర్ పూజా పిళ్లై వాటర్ వెయిట్ గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు వివరించారు. అవేంటో.. దీనిని ఎలా అదుపులోకి తెచ్చుకోవాలో చూసేద్దాం.

Also Read : బరువు తగ్గాలా? కఠినమైన డైట్ వద్దు, ఈ చిన్న మార్పులు చాలు అంటోన్న హెల్త్ కోచ్.. వీటితో పది కిలోలు తగ్గిందట

వాటర్ వెయిట్

చాలా మందికి వాటర్ వెయిట్ అంటే అసలు ఏమిటో తెలియదు. నీరు తాగితే కడుపు ఉబ్బరంగా ఉంటే దానినే వాటర్ వెయిట్ అనుకుంటారు. కానీ శరీరం తన కణజాలాలలో నిలుపుకునే అదనపు ద్రవాన్నే నీటి బరువు అంటారు. ఇది కొవ్వులాంటిది కాదు.. ఎందుకంటే శరీరం ఇంకా తొలగించని నీటి నుంచే ఇది వస్తుంది. మీరు ఎక్కువ ఉప్పు తిన్నప్పుడు, హార్మోన్ల మార్పులు ఉన్నప్పుడు, ఒత్తిడికి గురైనప్పుడు, తగినంత నీరు తాగనప్పుడు, లేదా ఎక్కువ సేపు నిలబడినప్పుడు లేదా కూర్చున్నప్పుడు ఇలాంటి సమయంలో వాటర్ వెయిట్ తెలుస్తుందని తెలిపారు.

కడుపు, ముఖం, చేతులు లేదా కాళ్ల వంటి ప్రదేశాలలో ఉబ్బరంగా, బరువుగా లేదా వాచినట్లుగా అనిపించడానికి వాటర్ వెయిట్​ కారణమని అంటున్నారు. కానీ ఇది కొన్ని రోజుల్లోనే త్వరగా తగ్గిపోతుంది. ఉప్పు తగ్గించడం, ఎక్కువ నీరు తాగడం, వ్యాయామం చేయడం లేదా ఎక్కువ పండ్లు, కూరగాయలు తినడం వంటివి చేస్తే నీటి బరువు తగ్గిపోతుంది. కాబట్టి ఇది తాత్కాలికమేనని డాక్టర్ పిళ్లై తెలిపారు.

Also Read : అన్నానికి బదులుగా డిన్నర్​లో ఇవి తినండి.. కడుపు నిండటంతో పాటు బరువు తగ్గేందుకు హెల్ప్ చేస్తాయి

శరీరంలో నీరు నిలిచిపోవడానికి కారణమేమిటి?

శరీరంలో నీరు పేరుకుపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఎక్కువ ఉప్పు తినడం, తగినంత నీరు తాగకపోవడం, ఋతుస్రావం లేదా మెనోపాజ్ సమయంలో హార్మోన్ల మార్పులు, స్టెరాయిడ్లు, రక్తపోటు మందులు లేదా గర్భనిరోధక మాత్రల వంటి కొన్ని మందులు వాడటం, ఎక్కువ సేపు నిలబడటం లేదా కూర్చోవడం వల్ల కూడా కాళ్లలో లేదా పాదాల్లో ద్రవాలు పేరుకుపోతాయి.

మూత్రపిండాలు, కాలేయం లేదా గుండె సమస్యల వంటి వైద్య పరిస్థితులు మరింత ఎక్కువ నీరు నిలిచిపోవడానికి కారణం కావచ్చు. ఒత్తిడి లేదా ప్రోటీన్ తక్కువగా తీసుకున్నా కూడా శరీరంలో నీరు పేరుకుపోవచ్చని తెలిపారు. కాబట్టి నీరు నిలిచిపోవడం తాత్కాలికమే అయినా.. అది తరచుగా లేదా తీవ్రంగా మారితే టెస్ట్​ చేయించుకోవాలని డాక్టర్ పిళ్లై సూచించారు.

Also Read : పిల్లల్లో బరువు పెరుగుదలకు(Obesity) నిద్రలేమి కూడా కారణమేనా? వైద్యుల హెచ్చరికలు ఇవే

నీటి బరువును ఎలా గుర్తించాలంటే..

నీటి బరువుకు, సాధారణ బరువుకు మధ్య తేడాను గుర్తించడం కొంచెం కష్టంగా అనిపించవచ్చు. కొవ్వు నిజంగా పెరగకుండా.. మీ శరీరం ఉబ్బినట్లుగా, వాచినట్లుగా లేదా మామూలు కంటే బరువుగా అనిపిస్తే.. అది నీటి బరువు. నీటి బరువు సాధారణంగా వాపుతో వస్తుంది. చర్మంపై నొక్కినప్పుడు ఒక చిన్న గుంట ఏర్పడుతుంది. దీనిని పిట్టింగ్ అంటారు. అయితే కొవ్వు ఇలా ఉండదు.

నీటి బరువును తగ్గించే చిట్కాలు

ఎక్కువ నీరు తాగడం, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు తగ్గించడం, వ్యాయామం చేయడం లేదా విశ్రాంతి తీసుకోవడం వల్ల నీటి బరువు త్వరగా తగ్గిపోతుంది. అరటిపండ్లు, పాలకూర వంటి పొటాషియం అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను ఎక్కువగా తినండి. ఇవి శరీరంలోని ద్రవాలను సమతుల్యం చేయడానికి సహాయపడతాయి. రక్త ప్రసరణను మెరుగుపరచడానికి, శరీరం నుంచి అదనపు నీటిని చెమట రూపంలో బయటకు పంపడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. తగినంత నిద్ర, ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం కూడా ముఖ్యమే.

Also Read : బరువు తగ్గాలన్నా.. పొట్టను తగ్గించుకోవాలన్నా.. ఈ ఎఫెక్టివ్ 7 యోగాసనాలు వేసేయండి

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

Read Entire Article