Warangal Latest News: ఆడపిల్లలు లేకపోవడంతో ఓ ఆవును పెంచుకున్నారు. ఆ ఆవుకు గౌరీ అని నామకరణం చేసి ఆడబిడ్డగా పెంచుకుంటున్నారు. అది గర్భందాల్చి లేగ దూడకు జన్మనిచ్చింది. ఆ లేగ దూడకు నామకరణ మహోత్సవం నిర్వహించిన వరంగల్ జిల్లా కు చెందిన ఓ రైతు.

వరంగల్ జిల్లా నర్సంపేట మండలం దాసరి పల్లె గ్రామానికి చెందిన పెండ్యాల సురేందర్ స్వరూప దంపతులు ఐదు సంవత్సరాల క్రితం వరంగల్‌లోని మహారుషి గోశాల నుంచి గోవును తీసుకువచ్చారు. దానికి గౌరి అని నామకరణ చేసారు. దానిని నిత్యం పూజిస్తూ గౌరవంగా పోషించసాగాడు.

గౌరీ డిసెంబర్‌ నెల 19న ఓ లేగదూడకు జన్మనిచ్చింది. జన్మనిచ్చి 13 రోజులు కావస్తుండడంతో దానికి పేరు పెట్టాలని నిర్ణయించాడు రైతు సురేందర్‌. ఈ నామకరణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని చూశాడు. కార్యక్రమానికి తన కుటుంబ సభ్యులతోపాటు బంధుమిత్రులను గ్రామస్తులను ఆహ్వానించారు. అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో నామకరణ మహోత్సవం చేశారు.

ఇంట్లోని పిల్లలకు ఏ విధంగా నామకరణ మహోత్సవం నిర్వహిస్తారో, అదే మాదిరిగా అంగరంగ వైభవంగా నిర్వహించి దానికి నందిశ్వరుడు అని నామకరణం చేయడం జరిగింది. ఈ నామకరణ మహోత్సవాన్ని గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వారు వచ్చి తిలకించారు. ఇలాంటి తంతు ఎక్కడా చూడలేదని ఇదే మొదటిసారి అని ఇంత మంచి కార్యక్రమం చూడడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.