Walking Guide : రోజూ ఎంతసేపు నడిస్తే షుగర్, బరువు కంట్రోల్ అవుతుంది? 1 నుంచి 60 నిమిషాలు నడకతో జరిగే మార్పులు ఇవే
1 month ago 6
ARTICLE AD
Surprising Benefits of Walking Daily : ఈ రోజుల్లో ఆరోగ్యంగా, ఫిట్​గా ఉండేందుకు చాలామంది నడకను ఎంచుకుంటున్నారు. ఇది ఆరోగ్య లాభాలను అందించే సులభమైన, చవకైన, అత్యంత ప్రభావవంతమైన మార్గంగా చెప్పవచ్చు. నడక అనేది కేవలం బరువు తగ్గడం గురించే కాదు.. రక్తంలో చక్కెరను నియంత్రించడానికి, గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి, మానసిక ఒత్తిడిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అయితే మీరు నడిచే సమయం మీ శరీరంపై దాని ప్రయోజనాలను నేరుగా ప్రభావితం చేస్తుందట.
అంటే మీరు 1 నిమిషం నుంచి 60 నిమిషాల వరకు.. ప్రతి సమయానికి దాని సొంత ప్రయోజనాలు ఉన్నాయట. పోషకాహార నిపుణుల ప్రకారం.. చిన్నపాటి నడకలు కూడా మీ శరీరం, మనస్సులో గణనీయమైన మార్పులను తీసుకురాగలవని చెప్తున్నారు. కాబట్టి ఎంత సమయం నడిస్తే ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో తెలుసుకుని.. మీ అవసరానికి అనుగుణంగా మీ నడకను ఈరోజే ప్రారంభించండి.
ఒక్క నిమిషం..
ఒక్క నిమిషం నడిస్తే.. పెద్ద తేడా ఏమీ ఉండదని మీరు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే చిన్న నడక కూడా శరీరంలో రక్త ప్రసరణను పెంచుతుంది. అలాగే శరీరాన్ని ఉత్తేజపరచడానికి సహాయపడుతుంది.
5 నిమిషాల వాక్
5 నిమిషాల నడక మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. బాగా ఒత్తిడికి లోనైనప్పుడు మీ మనసు తేలికపరచుకోవాలనుకుంటే.. హాయిగా వాకింగ్ చేయవచ్చు. ఒత్తిడి హార్మోన్ (కార్టిసాల్)ను తగ్గిస్తుంది. దీనివల్ల ఒత్తిడి తగ్గి మీ మనస్సు మరింత ప్రశాంతంగా మారుతుంది.
పది నిమిషాలు
రోజూ 10 నిమిషాలు నడిస్తే  జీర్ణక్రియకు సహాయం చేస్తుంది. భోజనం తర్వాత 10 నిమిషాలు నడిస్తే కడుపు ఉబ్బరం తగ్గుతుంది.
15 నిమిషాల నడక
20 నిమిషాల నడక
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలనుకుంటే.. రోజుకు 20 నిమిషాలు నడవండి. ఇది గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే బీపీ కూడా తగ్గుతుంది.
30 నిమిషాల నడక
బరువు తగ్గాలనుకుంటే.. 30 నిమిషాలు నడవండి. అరగంట నడిస్తే ఫ్యాట్ బర్నింగ్ మొదలవుతుంది. వెయిట్ లాస్ కోసం ఇది మినిమమ్ అవసరమైన టైమ్.
40 నిమిషాలు నడిస్తే..
మీ మెటాబాలిజం వేగంగా పనిచేయాలనుకుంటే రోజుకు 40 నిమిషాలు నడవండి. దీనివల్ల మీరు ఖాళీగా ఉన్నప్పుడు కూడా రోజంతా కాలరీలు ఎక్కువగా బర్న్ అవుతాయి.
45 నిమిషాలు నడిస్తే
మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆందోళన, డిప్రెషన్ లక్షణాలు తగ్గుతాయి. మంచి నిద్ర మీ సొంతమవుతుంది.
60 నిమిషాల నడక
రోజూ నడిస్తే..
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
Read Entire Article