Walayar parents aided the accused to rape their minor daughters says CBI charge sheet: అది 2017వ సంవత్సరం . కేరళలోని వలయార్ అనే ఊరు. ఓ రోజు ఉదయం పదమూడేళ్ల బాలిక ఓ ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. ఈ వ్యవహారం పై ఊరంతా గగ్గోలు రేగింది. తర్వాత ఆరు నెలలకు ఆ బాలిక చెల్లెలు తొమ్మిదేళ్ల బాలిక కూడా ఆత్మహత్య చేసుకుంది. దీంతో కేరళ మొత్తం ఉడికిపోయింది. కేరళ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించింది.

అప్పట్లో విచారణ జరిపిన పోలీసులు ఆ ఇద్దరు బాలికలు ఆత్మహత్య చేసుకున్నారని తేల్చారు. అయితే వారిద్దరూ లైంగిక దాడికి గురయ్యారని వారిని అత్యాచారం చేసినట్లుగా తేల్చారు.దీంతో కేసు మరింత క్లిష్టంగా మారింది. మొత్తం నలుగుర్ని నిందితులుగా చేర్చి పోలీసులు పోక్సో కేసులు పెట్టారు. కానీ వారు దిగువకోర్టులో సాక్ష్యాల్లేని కారణంగా బయటపడ్డారు.

ఈ కేసు విషయంలో తన కుమార్తెలకు అన్యాయం ఆమె తల్లి గుండు చేయించుకుని నిరసన తెలపడం సంచలనంగా మారింది. చివరికి హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా సీబీఐ దర్యాప్తు చేసి సంచలన విషయాలను వెల్లడించింది.

Also Read: అది అడవిలో జంటలుగా గడిపాల్సిన బిగ్ బాస్ షో - అక్కడో ఘోరం జరిగిపోయింది - ఇప్పుడిదే వైరల్ వీడియో

బాలికల తల్లికి.. ఈ కేసులో నిందితుడుగా ఉన్న వ్యక్తికి మధ్య వివాహేతర బంధం ఉంది. ఆ బంధం ఉందని ఆమె భర్తకు తెలుసు. ఆ తల్లి .. తనకు వివాహేతర బంధం ఉన్న వ్యక్తితో ఇంట్లోనే..అది కూడా తన కుమార్తెల ముందే శృంగారం చేసేది. అంతే కాదు..ఆ వ్యక్తి తన పిల్లలను లైంగికంగా వేధిస్తున్నా వారించేది కాదు.ఇలా తల్లితో పాటు ఆమె పెద్ద కుమార్తె పదమూడేళ్ల అమ్మాయిని కూడా ఆ వ్యక్తి అత్యాచారం చేశాడు. దీన్ని భరించలేక ఆ పాప ఆత్మహత్య చేసుకుంది. అంతా తెలిసి కూడా ఆ తల్లి సైలెంట్ గా ఉంది. తర్వాత ఆ వ్యక్తి ఆమె రెండో కుమార్తె మీద కూడా అత్యాచారం చేశాడు.ఆ పాప కూడా తన తల్లే తన జీవితాన్ని నాశనం చేసిందని బాధపడి ప్రాణం తీసుకుని అక్క దగ్గరకు వెళ్లిపోయింది.

అప్పటికీ ఆ తల్లి నిజం చెప్పలేదు. అయితే అసలు నిందిదతుడు.. ఆమెతో వివాహేతర బంధం పెట్టుకున్న వక్తి.. హఠాత్తుగా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఆ తర్వాత ఆమె తన కు న్యాయం చేయాలని.. తన కుమార్తెలకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు.సీబీఐ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగు చూడటంతో.. కేరళ హైకోర్టు కేసును పోక్సో కోర్టు నుంచి సీబీఐ కోర్టుకు మార్చింది. ఈ వలయార్ రేప్ అండ్ మర్డర్ సేకులు కేరళలో సంచలనంగా మారాయి.

Also Read: ముఖానికి కవర్ చుట్టి నైట్రోజన్ గ్యాస్ పంపి చంపేశారు - హత్య కాదు ఉరిశిక్ష- అమెరికాలో అంతే !