భారత్ ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ, పర్యావరణ హిత ఇంధనాల వైపు ఫోకస్ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ కాకుండా ఇతర ఇంధనాలతో నడిచే వాహనాలను ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలోనే ఫ్లెక్స్ ఫ్యూయల్ (Flex Fuel) కార్ల గురించిన చర్చ జరుగుతోంది. ఈ వాహనాల ప్రత్యేకత ఏంటంటే, ఇవి కేవలం పెట్రోల్‌తోనే కాకుండా, ఎక్కువ శాతం ఇథనాల్ కలిపిన ఇంధనంతో రోడ్లపై దూసుకెళ్లనున్నాయి. పెట్రోల్, డీజిల్ భారాన్ని తగ్గించి, దేశ దిగుమతి ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రభుత్వం కూడా ఇథనాల్ వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది.

పలు ప్రముఖ కార్ల కంపెనీలు తమ ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలను భారత మార్కెట్లో ఇదివరకే ప్రదర్శించాయి. మారుతి వ్యాగన్ఆర్ (WagonR) నుండి హ్యుందాయ్ క్రెటా (Creta) వరకు ఎన్నో ప్రజాదరణ పొందిన మోడళ్లు ఈ కొత్త సాంకేతికతతో ముందుకు వచ్చాయి. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఇథనాల్ పంపులు పెరిగినప్పుడు, ఇలాంటి వాహనాలకు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది.

Also Read: Affordable 7 Seater Cars: 10 లక్షల రూపాయల్లో బెస్ట్ 7 సీటర్ కార్లు ఇవే.. ఫ్యామిలీ జర్నీకి తిరుగులేదు

మారుతి నుండి హ్యుందాయ్ వరకు.. గుర్తింపు పొందిన కార్లు
ఫ్లెక్స్ ఫ్యూయల్ సాంకేతికతను అత్యంత వేగంగా ముందుకు తీసుకెళ్తున్న కంపెనీలలో మారుతి సుజుకి (Maruti Suzuki) పేరు అందరికంటే ముందుంది. ఈ కంపెనీ వ్యాగన్ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ (WagonR Flex Fuel), బ్రెజ్జా ఫ్లెక్స్ ఫ్యూయల్ (Brezza Flex Fuel), గ్రాండ్ విటారా ఫ్లెక్స్ ఫ్యూయల్ (Grand Vitara Flex Fuel) వంటి మోడళ్లను మార్కెట్లోకి తేవడానికి సిద్ధంగా ఉంది. ఈ వాహనాలు E20 నుండి E85 వరకు వివిధ రకాల ఇథనాల్ మిశ్రమాలు గల ఇంధనంతో నడుస్తాయి. మరోవైపు, హ్యుందాయ్ (Hyundai) కూడా ఫ్లెక్స్ ఫ్యూయల్ క్రెటాను ప్రదర్శించి తన ఉనికిని చాటుకుంది.

ఈ వాహనాలలో ప్రత్యేక రకమైన ఇంజన్, ఫ్యూయల్ సిస్టమ్‌ను కంపెనీలు సెట్ చేస్తాయి. ఇది ఎక్కువ ఇథనాల్ శాతం ఉన్న ఇంధనాన్ని వాడుకుని రోడ్లపై పరుగులు తీస్తుంది. ఇదే కారణంతో సాధారణ పెట్రోల్ కార్లకు, ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్లకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. కొన్ని సంవత్సరాల్లో మరికొన్ని కంపెనీలు కూడా ఈ సరికొత్త టెక్నాలజీతో కొత్త మోడళ్లను తీసుకువచ్చే అవకాశం ఉంది.

Also Read: Tata Motors Announces Massive Discounts: టాటా కార్ల‌పై భారీ డిస్కౌంట్లు.. ఈ నెలలో కొంటే ఏకంగా 3.35 లక్షల వరకు లాభం