Volkswagen Cars December Discounts: ఈ డిసెంబర్‌లో, భారీ బంపర్ ఆఫర్లతో కార్ కొనాలనుకునే వారికి మంచి ఛాన్స్ వచ్చింది. ముఖ్యంగా Volkswagen కార్లపై ఈ నెలలో భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. కంపెనీ తమ మూడు ప్రధాన మోడళ్లైన Tiguan, Taigun, Virtus మీద క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్‌చేంజ్ బోనస్, స్క్రాపేజ్ బోనస్, లోయాల్టీ బెనిఫిట్స్ అందిస్తోంది. నగరం, డీలర్‌షిప్, స్టాక్ ఆధారంగా ఈ ఆఫర్లు మారవచ్చు. అయితే మొత్తం మీద చూస్తే ఈ సంవత్సరం చివర్లో Volkswagen కార్ కొనాలనుకునే వారికి పెద్ద సేవింగ్స్ అవకాశం వచ్చింది.

Volkswagen Tiguan Discounts - రూ.3 లక్షల వరకు ఆఫర్

వోక్స్‌వ్యాగన్‌ (VW) ఫ్లాగ్‌షిప్ SUV అయిన Tiguan R Line ఈ డిసెంబర్‌లో భారీ డిస్కౌంట్‌తోనే అందుబాటులో ఉంది. మొత్తం రూ. 3 లక్షల వరకు బెనిఫిట్స్ లభిస్తున్నాయి. ఇందులో:

క్యాష్ డిస్కౌంట్: రూ. 2 లక్షల వరకు

లోయాల్టీ బోనస్: రూ. 50,000

ఎక్స్‌చేంజ్ బోనస్: రూ. 50,000 (లేదా స్క్రాపేజ్ బోనస్ రూ. 20,000)

రూ. 49 లక్షల ధరతో ప్రారంభమయ్యే ఈ ప్రీమియం SUVపై ఇంత పెద్ద డిస్కౌంట్ రావడంతో, లగ్జరీ SUV సెగ్మెంట్‌లో మంచి అవకాశం అందుబాటులోకి వచ్చినట్లైంది. ఫ్యామిలీ SUV కావాలి, యూరోపియన్ క్వాలిటీ కావాలి అనుకునేవారికి ఈ ఆఫర్ నిజంగా ఆకర్షణీయంగా ఉంటుంది.

Volkswagen Taigun Discounts - రూ. 2 లక్షల వరకు

మిడ్‌సైజ్‌ SUV సెగ్మెంట్‌లో Taigun ఇప్పటికే మంచి డిమాండ్ ఉన్న మోడల్. ఈ నెలలో ప్రధానంగా రెండు ఇంజిన్ ‍‌(Taigun 1.0 TSI) ఆప్షన్స్‌పై ఆఫర్లు ఉన్నాయి.

Taigun 1.0 TSI ఆఫర్లు

1.0 TSI మోడళ్లపై రూ. 1.50 లక్షల వరకు

MY2024 Taigun 1.0 TSI వేరియంట్లపై రూ. 2 లక్షల వరకు

Topline MT మోడళ్ల మీద అత్యధిక డిస్కౌంట్లు

అదేవిధంగా, Comfortline 1.0 మాన్యువల్ వేరియంట్‌ను రూ. 10.58 లక్షల ప్రత్యేక ధరకు అందిస్తున్నారు. Highline MY2024 ధరలు కూడా తగ్గాయి:

Highline MT: రూ. 11.93 లక్షలు

Highline AT: రూ. 12.95 లక్షలు

Taigun 1.5 TSI ఆఫర్లు

GT Plus వేరియంట్‌లపై క్యాష్ డిస్కౌంట్ లేకపోయినా, మొత్తం బెనిఫిట్స్ రూ. 70,000 వరకు ఉన్నాయి.

MY2025 GT Plus MT: రూ. 1.50 లక్షల తగ్గింపు

MY2024 GT Plus MT: రూ. 1.44 లక్షల తగ్గింపు

GT Plus DSG MY2025: రూ. 1.51 లక్షల వరకు తగ్గింపు

MY2024 DSG: రూ. 1.45 లక్షల వరకు బెనిఫిట్స్

ఈ ఆఫర్లు Taigun 1.5 ను మార్కెట్లో మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నాయి.

Volkswagen Virtus Discounts - రూ. 1.56 లక్షల వరకు

సెడాన్ ప్రేమికులకు Virtus మంచి ఆప్షన్. ఈ నెలలో Virtus 1.0 TSI, 1.5 TSI రెండింటిపైనా ఆఫర్లు ఉన్నాయి.

Virtus 1.0 TSI ఆఫర్లు

Highline: రూ. 1.56 లక్షల వరకు

Topline: రూ. 1.50 లక్షల వరకు

MY2025 Highline Plus: రూ. 80,000 వరకు

Virtus 1.5 TSI ఆఫర్లు

GT Plus MT: రూ. 50,000 వరకు బెనిఫిట్స్

GT Plus DSG: రూ. 1.20 లక్షల వరకు తగ్గింపు

ఈ ధరలతో, సెడాన్ సెగ్మెంట్‌లో Virtus మరింత 'వ్యాల్యూ ఫర్ మనీ' ఆప్షన్‌గా నిలుస్తోంది.

Volkswagen ఈ డిసెంబర్‌లో కొనుగోలుదారులకు మంచి అవకాశాన్ని తీసుకువచ్చింది. Tiguanలో లగ్జరీ SUV అనుభవం, Taigunలో ప్రీమియం డ్రైవింగ్ డైనమిక్స్, Virtusలో స్లీక్ సెడాన్ కంఫర్ట్‌.. అన్నీ డిస్కౌంట్స్‌లో వస్తున్నాయి. కాబట్టి ఈ నెలలో VW కార్ కొనాలనే ప్లాన్ ఉంటే, ఇది మిస్ కాకూడని టైమ్.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.