Sree Vishnu's Vishnu Vinyasam Teaser Review : టాలీవుడ్ యంగ్ హీరో, కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీవిష్ణు హీరోగా లేటెస్ట్ లవ్ కామెడీ ఎంటర్టైనర్ 'విష్ణు విన్యాసం'. కొత్త దర్శకుడు యదునాథ్ మారుతీరావు దర్శకత్వం వహించిన ఈ మూవీ టీజర్ తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్.

టీజర్ ఎలా ఉందంటే?

మూవీలో వాస్తును ఫాలో అయ్యే వ్యక్తిగా శ్రీవిష్ణు సందడి చేశారు. రొమాంటిక్ లవ్ స్టోరీగా మూవీ తెరకెక్కినట్లు టీజర్‌ను బట్టి అర్థమవుతోంది. 'జున్ను మందు తెచ్చాను తాగుదాం దా. క్లాప్స్ ఎందుకూ?' అంటూ ఓ కామెడీ డైలాగ్‌తో టీజర్ ప్రారంభం కాగా... హీరోయిన్ చేతిలో వోడ్కా గ్లాస్‌తో కనిపిస్తుంది. వాస్తు పిచ్చి ఎక్కువగా ఉన్న అబ్బాయి ఓ అమ్మాయిని ప్రేమిస్తే ఏం జరిగింది? అనేదే ప్రధానాంశం అని తెలుస్తోంది. తనకు పెళ్లి సంబంధం చూడాలని తను ప్రేమించిన అమ్మాయే లవర్‌ను అడిగితే... ఆ హీరో పరిస్థితి ఏంటి అనేది ఎంటర్టైనింగ్‌గా చూపించారు.

Also Read : రాజమౌళి 'వారణాసి'లో కన్నడ స్టార్? - ఈగ, బాహబలి తర్వాత విజువల్ వండర్‌లో...