ఆలోచింపజేసే వీడియో, నవ్వు తెప్పించే వీడియో అయినా సరే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియో చూసి జనాలు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. ఓ భర్త చేసిన రిక్వెస్ట్ నెటిజన్లకు నవ్వు తెప్పిస్తోంది. ఈ చిన్న సంఘటన ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఎంటర్‌టైన్మెంట్‌గా మారింది. సాధారణంగా టోల్ ప్లాజాల వద్ద ప్రజలకు, సిబ్బందికి మధ్య గొడవలు లేదా వాదనలు జరిగే వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈసారి మ్యాటర్ పూర్తిగా వేరే ఉంది.

ఒక వ్యక్తి టోల్ ప్లాజా నుంచి వెళుతుండగా, టోల్ సిబ్బందితో.. తాను భార్యకు చెప్పకుండా ఇంటి నుండి బయటకు వచ్చానని చెబుతాడు. ఒకవేళ టోల్ డబ్బులు కట్ అయితే, భార్య ఫోన్‌కు మెసేజ్ వెళ్తుందని, అప్పుడు ఆమె తనను ప్రశ్నిస్తుందని, హెల్ప్ చేయాలని అడుగుతాడు. ఈ మాట విన్న టోల్ ఉద్యోగి నవ్వి, ఆ డ్రైవర్‌ను టోల్ కట్టకుండానే వెళ్లనిస్తాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

భార్య అంటే అంత భయం!

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. వైరల్ వీడియోలో, ఒక డ్రైవర్ తన కారుతో టోల్ ప్లాజాకు చేరుకుంటాడు. కానీ టోల్ చెల్లించే ముందు అతను సిబ్బందితో సరదాగా.. ఒకవేళ టోల్ కట్ అయితే వెంటనే తన భార్య ఫోన్‌కు మెసేజ్ వెళ్తుంది అని చెబుతాడు. తాను భార్యకు చెప్పకుండా ఇంటి నుండి బయలుదేరానని, ఒకవేళ ఆమెకు మెసేజ్ వెళ్తే ఇంటికి వెళ్ళాక తన పని అయిపోతుందని చెబుతాడు. డ్రైవర్ మాటలు విని టోల్ ప్లాజా ఉద్యోగి కూడా నవ్వుతాడు. అతను కోప్పడకుండా, సరదాగా అతనికి సహకరించి సరే వెళ్లు అంటాడు. ఇదే క్రమంలో డ్రైవర్ టోల్ సిబ్బందితో.. "ఒకరోజు మీరు కూడా మీ భార్యకు చెప్పకుండా ఇంటి నుండి బయటకు వచ్చినప్పుడు దేవుడు మీకు సాయం చేస్తాడు" అని అంటాడు. అందుకు టోల్ ప్లాజా ఉద్యోగి ‘మేము అలా వెళ్లం’ అని సమాధానం ఇస్తాడు. ఈ సంభాషణ సోషల్ మీడియాలో జనాలకు బాగా నచ్చింది.

View this post on Instagram

A post shared by @instaviral.inm

యూజర్ల ఫన్నీ రియాక్షన్స్

వైరల్ అవుతున్న ఈ వీడియోలో 'భార్య అంటే భయం' అనేది ప్రజలకు బాగా కనెక్ట్ అవుతోంది. ఇదే ఈ వీడియోను వైరల్ చేసింది. ఈ వీడియో చూసి ఒక యూజర్ ‘భార్య అంటే భయం’ అని కామెంట్ చేయగా, మరొకరు ..ఒక మగాడి బాధ ఇంకో మగాడికే తెలుస్తుంది అని కామెంట్ చేశాడు. నగదు (Cash) ఇచ్చి ఉంటే మెసేజ్ వెళ్లేది కాదని ఒకరు, ఇప్పుడు ఈ వీడియోను కూడా వాళ్ల ఆవిడ చూసే ఉంటుందని మరొకరు కామెంట్ చేశారు. టోల్ అయితే మిగిల్చుకున్నావు కానీ, ఇప్పుడు ఇంటికి వెళ్లి ఎలా మేనేజ్ చేస్తావు? అని ఇంకొకరు సరదాగా ప్రశ్నించారు.