Bride family rejects wedding over groom poor credit rating: కులాలు, మతాలతో సంబంధం లేకుండా ఇప్పుడు ముఫ్పై ఏళ్లు దాటినా చాలా మంది మగవాళ్లకు పెళ్లి చేసుకోవడానికి పిల్ల దొరకడం లేదు. బ్రహ్మచారులుగా ఉండేవారు పెరుగుతున్నారు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనిని వెదుక్కుని మరీ పెళ్లి మండపంలో పెళ్లిళ్లను కూడా క్యాన్సిల్ చేసి మగవాళ్లకు మనోవేదన కలిగిస్తున్నారు. అన్నీ ఉన్నా..సిబిల్ స్కోర్ సరిగ్గా లేదని పెళ్లి క్యాన్సిల్ చేసేసిన ఘటన మహారాష్ట్రలో జరిగింది.

మహారాష్ట్రలోని ముర్తిజాపూర్లో రెండు కుటుంబాలు పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాయి. అబ్బాయి అందగాడు. చదువుకున్నాడు. మంచి ఉద్యోగం చేస్తున్నాడు. దాంతో అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఓకే చెప్పారు. అందరూ అన్ని మాట్లాడుకున్నారు. అయితే కుర్రాడు పెళ్లి కుదిరిందని భారీగా ఆడంబరాలకు ఖర్చు పెట్టాడు. ఖరీదైన , బ్రాండెడ్ వస్తువులు కొని హడావుడి చేశాడు. పెళ్లి కుమార్తెకు కూడా గిఫ్టులు ఇచ్చాడు. దాంతో అమ్మాయి మేనమామ కు డౌట్ వచ్చింది. ఇతనికి దుబారా ఎక్కువ అని..ఆర్థిక భద్రత ఉండదని అనుకున్నాడు. ఒక వేళ తన ఆదాయానికి సరిపోను ఖర్చు పెడితే పర్వాలేదనుకుని అతని సిబిల్ స్కోర్ చెక్ చేయాలనుకున్నాడు. ఎలా తెలుసుకున్నాడో కానీ.. పాన్ కార్డు నెంబర్ తెలుసుకుని సిబిల్ స్కోర్ తెలుసుకున్నాడు.

పెళ్లి కొడుకు సిబిల్ స్కోర్ ఆరు వందల కన్నా తక్కువ ఉంది. దీంతో ఆ మేనమామ.. తమ మేనకోడల్ని ఈ యువకుడు సరిగ్గా చూసుకోలేడని.. ఆర్థిక క్రమశిక్షణ లేదని తేల్చి.. పెళ్లి క్యాన్సిల్ చేయాలని పట్టుబట్టాడు. అందరూ చర్చించుకుని సిబిల్ స్కోర్ లేకపోతే బ్యాంకులు కూడా లోన్లు ఇవ్వవు.. తాము పిల్లను ఎందుకు ఇవ్వాలని తీర్మానించుకుని పెళ్లి క్యాన్సిల్ చేసేశారు. దీంతో ఆ యువకుడి కుటుంబానికి షాక్ తగిలినట్లయింది. అయితే కారణం అది కాదని.. వారికి ఇంకా మంచి ఆఫర్ వచ్చి ఉంటుందని అందుకే ఆ కారణం చెబుతున్నారని వారు మండిపడుతున్నారు.

Also Read: అది అడవిలో జంటలుగా గడిపాల్సిన బిగ్ బాస్ షో - అక్కడో ఘోరం జరిగిపోయింది - ఇప్పుడిదే వైరల్ వీడియో

కారణం ఏదైనా .. ఆ పెళ్లి కొడుకును వద్దనుకున్నా.. అతను చేయగలిగిదేమీలేదు. అయితే సిబిల్ స్కోరును బ్యాంకులు చాలా పక్కాగా చూస్తాయి. అతని ఆర్థిక క్రమశిక్షణ ఎంతో అది చూపిస్తుంది. డబ్బులకు గౌరవం ఇచ్చి.. పక్కాగా ఉంటే..అతనికి మంచి సిబిల్ స్కోర్ ఉంటుంది. ఆర్థికపరమైన సమస్యలు ఏమీ ఉండవని భావిస్తారు. అచ్చం బ్యాంకుల్లాగే ఆ అమ్మాయి తండ్రి కూడా ఆలోచించడంతో ఆ కుర్రాడి పెళ్లి రద్దయింది. ఎందుకయినా మంచిది.. పెళ్లి కాని అబ్బాయిలందరూ.. తమ సిబిల్ స్కోరును కనీసం ఏడు వందలకుపైగా ఉంచుకోండి. లేకపోతే బ్యాంకు లోన్లే కాదు.. పిల్లను కూడా ఇచ్చేవారు ఉండరు.

Also Read: సునామీ వచ్చినప్పుడు కాపాడారు - 20 ఏళ్లు కంటికి రెప్పలా కాపాడి పెళ్లి చేశారు - మనసున్న మారాజు ఈ ఐఏఎస్ ఆఫీసర్ !