10 Sisters Marriage Promise: భారతీయ కుటుంబాల్లో సెంటిమెంట్' అనేది ఒక బలమైన ఆయుధం. ముఖ్యంగా అది చావు బతుకుల్లో ఉన్న తండ్రి హాస్పిటల్ బెడ్ మీద అడిగిన కోరికైతే, ఇక కొడుక్కి తిరుగులేదు. పది మంది ఆడపిల్లల తర్వాత పుట్టిన సదరు ముద్దుల కొడుకు కూడా సరిగ్గా ఇదే ఉచ్చులో చిక్కుకున్నాడు. క్యాన్సర్ తో చివరి క్షణాల్లో ఉన్న తండ్రి.. కుమారుడిని దగ్గరకు తీసుకుని "నాన్నా.. నీ పది మంది అక్కల పెళ్లిళ్లు నువ్వే చేయాలి, ఎవరినీ సాయం అడగకూడదు" అని అడిగితే, ఆవేశంలో సరే అన్నాడు. అప్పుడు ఆయనకు తెలీదు.. అది ప్రామిస్ కాదు, తన జీవితానికి రాసుకున్న డెబిట్ వారెంట్ అని!

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ యువకుడి కథ వింటే జాలి పడాలో, అనుభవించు అని వదిలేయాల్లో ఎవరికీ అర్థం కాదు. ఇప్పటివరకు కేవలం ముగ్గురు అక్కల పెళ్లిళ్లు చేసేసరికి మనోడి అప్పు 35 లక్షలకు చేరింది. అంటే ఒక్కో పెళ్లికి సగటున 11 లక్షలకు పైగా చేశారన్నమాట. ఇంకా ఏడుగురు క్యూలో ఉన్నారు. అంటే లెక్క ప్రకారం చూస్తే, మిగిలిన ఏడుగురికి మరో 2 నుండి 3 కోట్లు కావాలి. వినడానికే షాకింగ్‌గా ఉంది . మరి ఆ డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? ఆకాశం నుండి రాలదుగా.. అప్పులే శరణ్యం!

ఈ గ్రేట్ ఇండియన్ వెడ్డింగ్ ఆడంబరాల పుణ్యమా అని, సదరు యువకుడు తన యవ్వనాన్ని బ్యాంకు ఈఎంఐలకే ధారపోస్తున్నాడు. అందరి పెళ్లిళ్లు అయ్యాక, ఏమైనా మిగిలి ఉంటే అప్పుడు నేను పెళ్లి చేసుకుంటా అని ఆయన నవ్వుతూ చెబుతుంటే, అది నవ్వులా లేక ఏడుపా అర్థం కావడం లేదు. నాకు పిల్లలు పుట్టేసరికి నాకు 60 ఏళ్లు వస్తాయి, అప్పుడు వాళ్లు బుడిబుడి అడుగులు వేస్తుంటారు అని ఆయన వేసిన జోక్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్.

నెటిజన్లు కూడా రెండు వర్గాలుగా విడిపోయారు. ఒక వర్గం అబ్బా.. ఏం బాధ్యత, ఇలాంటి కొడుకు ఉండాలి అని కీర్తిస్తుంటే, మరో వర్గం మాత్రం "బాధ్యత సరే.. కానీ ఈ ఆడంబరాల కోసం జీవితాన్ని తాకట్టు పెట్టడం తెలివైన పనేనా? అని ప్రశ్నిస్తున్నారు. నిజమే కదా! సింపుల్‌గా పెళ్లిళ్లు చేసి, ఆ డబ్బుతో అక్కాచెల్లెళ్ల పేరిట పొదుపు చేయవచ్చు కదా? కానీ మనకు పరువు ముఖ్యం కదా! సమాజం ఏమనుకుంటుందో అన్న భయం, బంధువుల మెప్పు కోసం చేసే ఖర్చులే మధ్యతరగతి వాడి పాలిట శాపాలు.

When you finally agree to family responsibilities but didn’t read the terms and conditions pic.twitter.com/CXpezMYu2x

— कलयुगी भीष्म (@ChadBhishm) May 24, 2026

మొత్తానికి ఈ యువకుడి కథ.. మన దేశంలోని మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక అజ్ఞానానికి, సామాజిక ఒత్తిళ్లకు ఒక నిలువెత్తు నిదర్శనం. తండ్రికిచ్చిన మాట నిలబెట్టుకోవడం గొప్పే, కానీ ఆ మాట కోటి రూపాయల అప్పుల్లో ముంచేది కాకూడదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి మన హీరో గారు తన మిగిలిన ఏడుగురు అక్కల పెళ్లిళ్లు ఎలా చేస్తారో, ఆ అప్పుల కుప్పలో నుండి ఎలా బయటపడతారో