Family Court Orders To Vijay Sangeetha Couple On Divorce Issue : కోలీవుడ్ స్టార్, టీవీకే అధ్యక్షుడు దళపతి విజయ్ నుంచి తనకు విడాకులు కావాలని ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. తాజాగా చెంగల్పట్టు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో డివోర్స్ పిటిషన్‌పై సోమవాారం విచారణ జరిగింది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం జూన్ 15కి వాయిదా వేసింది. ఆ రోజున విజయ్, సంగీత దంపతులు కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.

విజయ్ లాయర్ రిక్వెస్ట్... కానీ...

ప్రస్తుతం తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో విజయ్ ఎలక్షన్ క్యాంపెయిన్‌లో బిజీగా ఉన్నందున కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతారని విజయ్ తరఫు లాయర్ కోర్టుకు తెలపగా... న్యాయస్థానం దీనికి అంగీకరించనట్లు తెలుస్తోంది. ఆ రోజున ఆయన కూడా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసినట్లు సమాచారం. మరి దీనిపై విజయ్ తరఫు లాయర్లు ఏం చేస్తారో? చూడాల్సి ఉంది. విజయ్ మినహాయింపు కోరుతూ పిటిషన్ వేస్తారా? లేదా విజయ్ స్వయంగా హాజరవుతారో? అనేది త్వరలోనే క్లారిటీ రానుంది.

Also Read : థియేటర్లలో మలయాళ బ్లాక్ బస్టర్ తెలుగు వెర్షన్ - ఈ వారం ఓటీటీల్లో క్రేజీ మూవీస్ / వెబ్ సిరీస్‌ల ఫుల్ లిస్ట్