Vijay Deverakonda's Ranabaali Special Horse Riding Video : రౌడీ బాయ్, టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ బర్త్ డే సర్ప్రైజ్ వచ్చేసింది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'రణబాలి' నుంచి స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్.

పడి లేచిన కెరటం

ఈ మూవీలో వారియర్‌గా కనిపించనున్నారు విజయ్. దీని కోసం గుర్రపు స్వారీ సైతం నేర్చుకున్నారు. ఆయన గుర్రాన్ని మచ్చిక చేసుకుని దానిపై స్వారీ చేస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. గుర్రపు స్వారీ చేస్తుండగా... కింద పడి గాయాలైనా పడి లేచిన కెరటంలా ఓ పవర్ ఫుల్ వారియర్‌గా ఆయన తిరిగి రైడింగ్ చేయడం ఆకట్టుకుంటోంది. 'మా స్టాలియన్ విజయ్ దేవరకొండకు పుట్టిన రోజు శుభాకాంక్షలు' అంటూ మూవీ టీం ఈ వీడియోను పంచుకుంది.

దీన్ని చూసిన విజయ్ అభిమానులు కింద పడి గాయాలనై పట్టుదలతో గుర్రపు స్వారీ నేర్చుకున్నారని... వాట్ ఏ డెడికేషన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో పాటే బర్త్ డే విషెష్ కూడా చెబుతున్నారు.

Also Read : బాలయ్య, కొరటాల మూవీ - ఎవరూ ఊహించని టైటిల్!... గాడ్ ఆఫ్ మాసెస్ ట్రెండ్ వైరల్