Vijay Deverakonda Visits Puttaparthi: ప్రస్తుతం టాలీవుడ్ పెయిర్ హీరో విజయ్ దేవరకొండ, బ్యూటీ రష్మిక వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ జరిగిందనే వార్తలు అటు ఫిలింనగర్ వర్గాల్లోనూ ఇటు సోషల్ మీడియాలోనూ గత రెండు రోజులుగా హల్చల్ చేస్తున్నాయి. అయితే, దీనిపై ఇప్పటివరకూ ఇద్దరూ బహిరంగంగా ఎక్కడా రియాక్ట్ కాలేదు. తాజాగా... విజయ్ దేవరకొండ ప్రముఖ ఆలయంలో కనిపించారు.

సత్యసాయి ఆలయం సందర్శన

శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి సత్యసాయి మహా సమాధిని విజయ్ దర్శించుకోనున్నారు. ఆదివారం ప్రశాంతి నిలయం చేరుకున్న ఆయనకు... శాంతి భవన్ అతిథి గృహం ట్రస్ట్ వర్గాలు ఘన స్వాగతం పలికాయి. దీనికి సంబంధించిన ఫోటోస్, వీడియో వైరల్‌గా మారింది. శ్రీ సత్యసాయి పాఠశాలలోనే విజయ్ చదువుకున్నారు. దీంతో ఆయనకు పుట్టపర్తితో ఎనలేని అనుబంధం ఏర్పడింది.

Also Read: శ్రీకాంత్ కుమారుడు రోషన్ నెక్స్ట్ మూవీ - వయలెంట్ యాక్షన్ థ్రిల్లర్స్ డైరెక్టర్ విత్ లవ్ స్టోరీ